1.70 రూపాయల నగలు దోచుకెళ్లిన దొంగలు…..
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల కేంద్రంలో ఓ గోల్డ్ షాపులో దొంగతనం జరిగింది. మండల కేంద్రంలో ని సోనార్ గల్లీలో మూసి ఉన్న నగల దుకాణంలో దొంగలు సుమారు లక్ష డెబ్బై వేల రూపాయల నగలను దోచుకెళ్లారు.

ఇచ్చోడా ఎస్సై ఫరిద్ తెలిపిన వివరాల ప్రకారం …. టెహార్ రమేష్ అనే వ్యక్తి గత మూడు సంవత్సరాలు గా ఇచ్చోడలో ఓ అద్దె భవనంలో నగల షాపు నడుపుచున్నాడు. రోజు లాగానే మంగళవారం రోజు కూడా సాయంత్రం దుకాణం బంద్ చేసి ఇంటికెళ్లాడు. అయతే మరుసటి రోజు ఉదయం షాప్ షెట్టర్ ను గుర్తుతెలియని దొంగలు పగులగొట్టి అందులో ఉన్నా నగలు , వెండి మొదలగు లక్ష డెబ్భై వేలు విలువ చేసే బంగారు , వేడి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. షాపు యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


Recent Comments