సమస్యలు పరిష్కరించాలని కోరిన సర్పంచ్ లు….
అప్పులు చేసి పనులు పూర్తి చేస్తున్నాం….. ఓ సర్పంచ్ ఆవేదన …
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడా : ఇచ్చోడా మండల సర్వసభ్య సమావేశం సాధారణంగా ముగిసింది. ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
గ్రామాల్లో రోడ్లు , డ్రైనేజి ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు….
మండలము లోని మారుమూల ఆదివాసీ గ్రామాలైన శివ్ పెట్ , బాబ్జి పెట్ గ్రామాలకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలని కోరారు.
ఇచ్చోడా మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ల కోసం సిసి రోడ్లను కట్ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ , ఎంపీటీసీ లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. దీనికి స్పందించిన మిషన్ భగీరథ డి ఈ వెంకటేష్ మరియు జెఈ జైపాల్ లు త్వరలో కట్ చేసిన రోడ్లను రిఫిలింగ్ చేయిస్తామని అన్నారు.
ఈ విధంగా శాఖల వారీగా అధికారులు తమ పనుల యొక్క ప్రోగ్రెస్ ను వివరించారు.
సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలలు ప్రారంభమవుతున్నా నేపథ్యంలో పాఠశాలల్లో శానిటైజేషన్ చెపిస్తున్నట్లు ఏటిడబ్యుఓ సౌజన్య తెలిపారు.
రైతులకు 20 క్వింటాళ్లు గడ్డి విత్తనాలు పంపిణీ తో పాటు , పశువుల నట్టల నివారణ మందులు వేసినట్లు పశువైద్యాధికారి గోవింద్ నాయక్ తెలిపారు.
మండల వ్యవసాయ శాఖాధికారి రామ్ కిషన్ మాట్లాడుతూ రైతు భీమా ను 18 నుండి 50 సంవత్సరాల వయసున్న రైతులకు రైతు భీమా ఆన్లైన్ చేసినట్లు తెలిపారు. చనిపోయిన 67 మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా అందించినట్లు తెలిపారు.
రైతుబంధు క్రాప్ లోన్ లో తీసుకుంటున్నారు.
బ్యాంకు అధికారులు రైతు బంధు , రైతుభిమా నిధుల ను వ్యవసాయ రుణాల క్రింద బ్యాంకు అధికారులు జమచేసుకుంటున్నారని సభ్యులు వ్యవసాయ శాఖాధికారి దృష్టికి తీసుకొచ్చారు.
దీనికి గాను అలా చేయడం ప్రభుత్వ ఆదేశాల కు వ్యతిరేకం అని , అలా చేసే బ్యాంకు వివరాలు , రైతుల వివరాలు తమకు ఇవ్వాలని అన్నారు.
57 ఏళ్ళ వయస్సు వారికి పెన్షన్ అప్లై చేసుకోండి…. ఎలక్షన్ కార్డు వయస్సుకు ప్రామాణికం
నూతన పెన్షన్ కోసం అప్లై చేసే వారికి 57 సంవత్సరాలు పూర్తి అయితే దరఖాస్తులు చేసుకోవాలని తహశీల్దార్ అతికొద్దీన్ అన్నారు. 57 సంవత్సరాల వయస్సు ఎన్నికల కార్డులో ఉంటే సరిపోతుందని అన్నారు.
అదే విధంగా మండలం లో అదనపు రేషన్ షాపుల మంజూరు కోసం ప్రపోజల్ పంపినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఎంపిఓ రామ్ ప్రసాద్ , ఎంఈఓ రాథోడ్ ఉదయ్ రావ్ , విద్యుత్ శాఖ ఏఈ రవి , సర్పంచ్ లు , ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
అప్పులు చేసి పనులు పూర్తి చేసినం …. నిధులు సరిపోవడం లేదు..
నిధులు సరిపోక పనులు జరగకపోవడంతో ప్రజలు నిందిస్తున్నారు….
భీం రావ్ , కామాగిరి సర్పంచ్
గతంలో అధికారులు టార్గెట్లు ఇచ్చి పనులు చేయాలని ఒత్తిడి చేయడం తో అప్పులు చేసి మరీ పనులు పూర్తిచేసినం.. బిల్లు లు సకాలంలో రాకపోవడంతో అప్పుల పాలయ్యాము. గ్రామపంచాయతీకి భవనం లేదు. పాఠశాలలు ప్రారంభమవుతున్నా వేళా తాత్కాలిక పంచాయితీ భవనం ను శ్మశాన వాటికకి తరలించే పరిస్థితి ఏర్పడింది. గెలిచిన 3 సంవత్సరాల తరువాత పెన్షన్లు షురూ చేశారు. అర్హులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. వచ్ఛే నిధుల్లో సగం ఖర్చు కామాటి లకు , ట్రాక్టర్ ఈఎంఐ లకు సరిపోవడలేదని అన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments