- ఆటోల ఇంజన్ నంబర్, చస్సిస్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్లు తీసివేసి నఖిలీ నంబర్లు బిగించి అమ్మడానికి యత్నించిన దొంగల ముఠా అరెస్ట్..
- ఐదుగురు ఆటో దొంగల ముఠా సభ్యుల అరెస్ట్, ఇద్దరు పరారి.27 లక్షల విలువ చేసే 27 ఆటోలు మరియు (05) సెల్ ఫోన్ లు స్వాధీనం.
- ఏడుగురు మరియు ఇతరులపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు.
- పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి జిల్లా SP ఆదేశాల మేరకు, TownDSP అద్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు.
- ఆటో నంబర్లు, ఇంజన్ నెంబర్లు, చేసేస్ నెంబర్లు మార్పు చేసి ఆటోల విక్రయానికి పన్నాగం.
- ప్రజలు ఆటోలు కొనుగోలు చేసే ముందు సరైన జాగ్రత్తలు పాటించాలని సూచన.

పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
నిందితుల వివరాలు
A-1 Yousuf R/o Jaipoor now at KRK Colony (2)(పరారీ)
A-2. Sayyad R/o Jainoor (పరారీ)
A-3. Sharuk Pathan s/o Anees pathan, age: 30 yrs, Occ: Tractor Driver, R/o Ranadivenagar, Adilabad.
A-4. Althaf khan s/o Mohammad Khan, age: 25 yrs Occ: Mason, R/o Ranadivenagar, Adilabad.
A-5. Shaik Qayyum s/o Kamaal, age: 38 yrs, Occ: Agriculture, R/o Nagalkonda Village, Narnoor Mandal.
A-6. Afsar Baig s/o Musthafa Baig, age: 30 yrs, Occ: Auto Driver, R/o Nagalkonda Village, Narnoor Mandal.
A-7. Asad Khan s/o Saadath Khan, age: 24 Yrs, Occ: Mason, R/o Gondvarusa, Mahur (Tq) Nanded Dist. Maharastra State..
… Cr.No.134/2025, U/s: 303 (2), 318 (4) BNS of PS Adilabad Rural:
ఈరోజు రాంపూర్ బైపాస్ వద్ద A3 to A7 ల అరెస్ట్
ఆదిలాబాద్:
వివరాలలో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ వంతెన వద్ద వాహన తనిఖీలు నిర్వహించి సమయంలో నిందితుడు A3 షారుక్ పఠాన్ ఆదిలాబాద్ నందు దొంగలించ బడిన ఆటో (TS 01 UA 0832) తో అనుమానస్పదంగా పట్టుబడ్డాడని అతనిని విచారించగా ఏడుగురు ముఠా సభ్యులు అందరూ కలిసి హైదరాబాద్ ఆదిలాబాద్ నందు ఆటోలను దొంగలించి వాటి వాహన నంబర్లు ఇంజన్ నంబర్లు చేసిన నంబర్లు మార్చి వాటి స్థానంలో కొత్త నఖిలీ నంబర్లు ముద్రించి అమ్మడానికి సిద్ధంగా ఉన్న సమయంలో జిల్లా పోలీసులు వారిని పట్టుకొని కేసును చేదించారని తెలిపారు. A3 షారుక్పఠాన్ ను విచారించిన సందర్భంలో నిందితుడు A4 అల్తాఫ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్లగా అక్కడ A5 షేక్ ఖయ్యూం మరియు 15 ఆటోలు వీరిద్దరి వద్ద లభ్యమయ్యాయని తెలియజేశారు. తదుపరి వీరందరూ A6 అప్సర్ బేగ్ మరియు A7 అసద్ ఖాన్ ఇంటి వద్దకు తీసుకు వెళ్ళగా వారి వద్ద 11 ఆటోలు లభ్యమయ్యాయని తెలియజేశారు. వీరిపై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 6 కేసులు నమోదు అయి ఉన్నాయని తెలిపారు.


ఈ ఐదుగురు ప్రధాన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్న A1 యూసఫ్ మరియు A2 సయ్యద్ ల పథకం ప్రకారం ఆటోలను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దొంగలించి వాటిని ఇక్కడికి తీసుకువచ్చి అమ్మడానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రధాన నిందితులను పట్టుకోవడంలో జిల్లాలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి త్వరలో వారిని పట్టుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, దొంగలను పట్టుకోవడంలో జిల్లా పోలీసు యంత్రాంగం ముందు ఉంటుందని జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పిస్తుందని తెలిపారు. మొత్తం వీరందరి వద్ద 27 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 27 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ కే ఫణిందర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఎస్పై ముజాహిద్ మరియు CCS సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కే ఫణిధర్, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ చంద్రశేఖర్, ఎస్సై సయ్యద్ ముజాహిద్, రూరల్ పోలీసు మరియు సిసిఎస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
స్వాధీనం చేసుకున్న ఆటోల పలు Registration నంబర్లు.👇
1) TS 32 T 4233
2) TS01UC 0278
3) TS34TA7252
4) TS05UA1802
5) TS01UA0832
6) TS01UA4368
7) TS01UA6807
8) TS16UA1615
9) TS01UB0730
10) MH26AC2669
11) TS15UA6047
12) TS01UA0884
13) TS01UA3391
14) TS15UA6047
15) TS19T 4390
16) TS 34 TA 7252
ఇంకా ఇతర బండ్ల నంబర్లు తెలియాల్సి ఉందనీ తెలిపారు.
ప్రజలకు సూచన : ఎవరైనా పాత వాహనాలను అమ్మడానికి వచ్చినపుడు ఆ వాహనం యొక్క ఒరిజినల్ RC ని చూసి దానిలో ఉన్న RC నంబరు, చస్సిస్ నంబరు, ఇంజిన్ నంబరు లను సరిచూసుకొని అమ్మేవారు వాహన యజమాని అని దృవీకరించుకున్న తర్వాత మాత్రమే వాహనాలు కొనాలి. వాహనాల ఒరిజినల్ పేపర్స్ లేకుండా కొనకూడదు. దొంగిలించిన వాహనాలను కొంటి, కొన్నవారు ఆర్థికంగా నష్టపోవడం తో పాటు క్రిమినల్ కేసులు ఎదురుకోవలిసిరావచ్చు. అని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS పత్రిక ముఖంగా ప్రజలకు తెలియజేసినారు.
Gang of thieves arrested for trying to sell autos by removing engine number, chassis number, registration numbers and attaching fake numbers. Five members of the gang of auto thieves arrested, two absconding. 27 autos worth Rs. 27 lakhs and (05) cell phones seized. **Case registered against seven people and others at Adilabad Rural Police Station. *On the orders of the District SP, special teams have been formed under the leadership of Town DSP to catch the main masterminds who are absconding. *Planned to sell autos by changing auto numbers, engine numbers, and chassis numbers. * *People are advised to take proper precautions before buying autos.*
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments