Friday, November 22, 2024

BREAKING NEWS: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ …


🌑 సీసీటీవీ కెమెరాల ద్వారా అంతరాష్ట్ర దొంగల అరెస్టు …
🌑 ఆర్థిక నేరాల దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు….
🌑 5 గురి పై కేసు నమోదు,4 గురి అరెస్ట్, ఒకరు పరారీ.*

🌑 7 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, ఒక టీవీ, ఒక కెమెరా, వెండి వస్తువులు స్వాధీనం.*

🌑 ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పాత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం …



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ (క్రైమ్ న్యూస్ ) :

ఆర్థిక నేరాలను కట్టడి చేయడం కోసం ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా నిరాలను కట్టడి చేయడం కోసం, జరిగిన నేరాల దర్యాప్తు ముమ్మరం చేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందం ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్, సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నేరస్థులను కనుగొనడంలో ముందుంది. ఈ సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందనీ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ వివరాలను పాత్రికేయుల సమావేశం ద్వారా వెల్లడించారు. నిందితులు
*వివరాలు*
A1) మహమ్మద్ ఎజాజ్ s/o ఎండి బిలాల్, కైలాష్ నగర్ ఆదిలాబాద్.
A2) సయ్యద్ మున్వర్ @ బబ్లు, కన్వర్ట్, మహారాష్ట్ర (పరారీ).
A3) టి అజయ్ s/o దత్తు, రవీంద్ర నగర్.
A4) ఏం రాజేశ్వర్ s/o లింగన్న టీచర్స్ కాలనీ ఆదిలాబాద్.
A5) షేక్ సమీర్ s/o సాగీర్ కొలిపుర ఆదిలాబాద్.

లు జల్సాలకు అలవాటు పడి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. వివరాలలో ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఈ బృందం సీసీటీవీ కెమెరాల ద్వారా నేరస్తులను కనుగొని ఈరోజు ఏడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో ఒక టీవీ ఒక కెమెరా పలు వెండి ఆభరణాలను నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకుని ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడినట్లు తెలిపారు.

దొంగల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న చోరికి గురైన వాహనాలు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లాలో పలు మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేస్తూ మహరాష్ట్ర లోని కిన్వట్ ప్రాంతంగా అమ్ముతున్నటువటి అంతరాష్ట్ర ముఠా గుట్టరట్టు చేసిన అదిలాబాద్ జిల్లా పోలీసులు. మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసిన మొహమ్మద్ ఏజాజ్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం అదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మరియు సీసీఎస్ ఇన్స్పెక్టర్ డి. సాయినాథ్ మరియు సీసీఎస్ సిబ్బంది ఒక టీమ్ గా ఏర్పడి, దొంగతనాలు జరిగిన చోట అనేక సీసీ కెమెరాలు పరిశీలించి, వాటి ఆధారంగా పట్టుకోవడం జరిగింది. కైలాష్ నగర్ కి చెందిన షేక్ ఏజాజ్ అనే వ్యక్తి అదిలాబాద్ జిల్లాలో (5) మోటార్ సైకిళ్ళు, నిజామాబాద్ జిల్లాలో ఒక ఆటో, మరియు (2) మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసి మహరాష్ట్ర, కిన్వాట్ కి చెందిన బబ్లూ ఖాన్ కి రెండు మోటార్ సైకిళ్ళు అమ్ముకున్నట్లు మిగతా (5) మోటార్ సైకిళ్ళు,ఒక ఆటో ను తన ఇంటి వద్ద ఉంచినట్లు ఒప్పుకొగ, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు, కీన్వట్ కి చెందిన బబ్లూ ఖాన్ వద్ద రెండు మోటార్ సైకిల్ అదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు, అదేవిధంగా గత నెలలో షేక్ ఎజాజ్ మరియు మోయిజ్ లు కలిసి హౌసింగ్ బోర్డు లో దొంగతనం చేసిన కేసు లో ఒక సోనీ టీవీ, కెమెరా, మరియు వెండి వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

మిగిలిన వారు కూడా పలు నేరాలలో నేరస్తులను తెలియజేశారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి పోతారం శ్రీనివాస్, ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ కే సత్యనారాయణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ డి సాయినాథ్, ఎస్ఐ లక్ష్మయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి