రిపబ్లిక్ హిందుస్థాన్ ,గుడిహత్నూర్: ఆదివారం రోజు మధ్యాహ్నం గుడిహత్నూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్యాల కరుణాకర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 74వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మహాత్మా దేశ స్వాతంత్ర్య పోరాటంలో చూపినటువంటి “శాంతి అహింస”మార్గాలు ప్రపంచంలోనే ఆదర్శ వంతమైన నీతి మార్గాలు గుర్తించబడ్డాయని అన్నారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో బందీ అయిన భారత్ జాతికి స్వాతంత్ర్యన్ని తెచ్చారని అన్నారు. మహాత్మా గాంధీ ప్రపంచంలోనే ఓ మహా గొప్ప జ్ఞాని అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెళ్ళి శ్రీధర్ జిల్లా ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి డా.రాజు సుద్దాల, జిల్లా మైనార్టీ సెల్ సెక్రెటరీ
Thank you for reading this post, don't forget to subscribe!వషిం, మండల కాంగ్రెస్ నాయకులు కాంబ్లీ మారుతి చిరు వంశీ హరీష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments