సిరిచేల్మా గ్రామస్తుల ఆరోపణలు….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇచ్చోడ మండల కేటీఆర్ ఫారెస్ట్ పరిధిలోని సిరిచల్మా గ్రామంలో పాత బావులలో పూడిక తిస్తె ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని , రూ.10 వేలు ఇస్తేనే పనులు మొదలెట్టాలి లేదంటే లేదని చెప్పేసి తమను వేధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే బుధవారం రోజు జెసిబి తో తమ పాత బావిలోని పూడిక తీస్తుండగా అటవీశాఖ అధికారులు వచ్చి అడ్డుకున్నారని, అయితే ఇది ఎప్పుడో గతంలో 20 ఏళ్ల క్రితం తవ్విన భావి పూడిక తీస్తున్నామని చెప్పిన కూడా వినకుండా జెసిబి ని సీజ్ చేస్తామని తమను భయభ్రాంతులకు గురి చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తమకు పట్టాలు ఇచ్చారని , ఈ భూములకు పట్టాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.
అయితే మరోపక్క అధికారులు తమపై సర్పంచ్ భర్త మరి కొంతమందితో కలిసి తమ దాడికి ప్రయత్నం చేశారని కేటీఆర్ రేంజ్ ఎఫ్ఆర్వో వహబ్ అహ్మద్ మీడియాకు తెలియజేశారు.
Recent Comments