ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
నిర్మల్ జిల్లా : గత ఎనిమిది ఏళ్లుగా జీఎస్టీ పన్నుల పేరుతో పేద ప్రజల నడ్డి విరచి ఓటమి భయంతోనే మోడీ సర్కార్ జీఎస్టీ స్లాబులను తగ్గించిందని. ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఒకే దేశం .ఒకే పన్ను. నినాదంతో బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం 2017 జూలై 1 నుండి జీఎస్టీని అర్బటంగా ప్రవేశ పెట్టిందని అప్పటినుండి ప్రతిపక్షాలు ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా పన్నుల మోతతో సామాన్య మధ్య తరగతి ప్రజలతో పాటు చిన్న మధ్య తరగతి వ్యాపారులు నష్టపోయారన్నారు. అమెరికా భారతదేశం పై 25% టారిప్ లను విధించడంతో పాటు రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అధానంగా 25% ఆపరాధ టారిప్ విధింపుతో 50 శాతానికి పెరిగి .టెక్స్ టైల్స్ .డైమండ్ మాన్యు ప్యాక్చరింగ్ లాంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడిందని ఇప్పటికీ ఉద్యోగాలు కోల్పోయి విపరీతంగా పెరిగిన ఆర్థిక అసమానలతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా మేల్కొన్న కేంద్ర సర్కార్ రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే జీఎస్టీ పన్నులను తగ్గించేందుకు పూనుకుందన్నారు ఎనిమిదేళ్లుగా పన్నుల పేరుతో ప్రజలను పీల్చి. పిప్పి చేసి ఇప్పుడు ప్రజల సంక్షేమం కోసం జీఎస్టీ స్లాబులు తగ్గిస్తున్నట్లు బిజెపి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు


Recent Comments