పరీక్షలు లో తనిఖీలు నిర్వహించడానికి వచ్చిన బృందంపై విద్యార్థుల దాడి…
Thank you for reading this post, don't forget to subscribe!కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పరీక్షల నిర్వహణ తీరును బుధవారం రోజు పరిశీలించడానికి వచ్చిన ప్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఓ కళాశాల సెంటర్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు దాడి చేయడం సంచలనం రేకెత్తించింది. ఇచ్చోడా లోని ఓ కళాశాలలో తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించగా చిట్టీలు నడపడంనియడం లేదని ఉద్దేశంతో కొంతమంది కళాశాల విద్యార్థులు ప్లయింగ్ క్వాడ్ బృందం తో పాటు వారి కారు పై దాడి చేశారు. అయితే సదరు స్క్వాడ్ తనిఖీ బృందం అంతకుముందే సాయి సామత్ అనే పరీక్ష కేంద్రం లో 12 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లుగా తెలిసింది. అధికారుల కారును సైతం విద్యార్థులు ద్వంసం చేశారు.
అయితే ఈ దాడుల వెనుక మండలంలో కొన్ని కళాశాల యజమాన్యాలు ఒక్కటిగా మారి ప్రోత్సహిస్తున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
గతంలో కూడా రిపబ్లిక్ హిందుస్థాన్ ఈ విషయంపైనే జోరుగా మాస్ కాపీయింగ్ నడుస్తున్నట్లు వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం రోజు అదే నిజమైంది.
Recent Comments