రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
వాగులు, మురికి కాలువల కబ్జా ఇచ్చోడా పట్టణ ప్రజల పాలిట శాపంగా మారాయి. కొందరు అక్రమార్కులు మురికి కాలువ లను , ఇచ్చోడా పట్టణ కేంద్రం నుండి వర్షపు నీరు వెళ్ళడానికి ఉన్న ప్రధాన వాగును కబ్జా చేయడం తో ప్రతి యేటా ఇచ్చోడా పట్టణం నీట మునుగుతుంది. ప్రస్తుతం కురుస్తున్న అతి భారీ వర్షాలకు సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో పలు కాలనీలలో ఇండ్లలో వరద చేరడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. మండల కేంద్రం లోని సుభాష్ నగర్, రంజాన్ పుర మరియు ఇస్లాంపూర కాలనీల్లో వరద ప్రవాహంలో కొందరి ఇండ్ల నుండి టీవీ లు, ఫ్రీడ్జీలు నిత్యావసర సరుకులు కొట్టుకపోయాయి. వరద లో చిక్కుకున్న వారిని స్థానికులు కాపాడారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదకరంగా నీళ్లు చేరడం తో ఆసుపత్రి లో ఉన్న గర్భిణీ లను రాత్రి ఒంటి గంట సమయంలో గుడిహత్నూర్ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. గతంలో సైతం ఇలాగే ఆసుపత్రిలో వరద నీళ్లు చేరడం తో అప్పట్లో అధికారులు అతికష్టం మీదా ఆసుపత్రి నుండి రోగులను, వైద్యులను రక్షించిన దాఖలాలు ఉన్నాయి.

నియమనిభందనలు గాలికి
ఇండ్ల నిర్మాణం గాని ఇతర అభివృద్ధి నిర్మాణాలు ప్రణాళిక ప్రకారం చేయకపోవడం, విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం మురికి కాలువలు లేక వర్షాకాలం లో సామాన్య ప్రజలు కష్టాల పాలవుతున్నారు.

ప్రభుత్వ, భూములు ప్రధాన వాగు కబ్జా పై ముందే హెచ్చరించిన రిపబ్లిక్ హిందుస్థాన్
ప్రధాన మురికి కాలువ పై పక్క నిర్మాణాలు, వాగు కబ్జా పై రిపబ్లిక్ హిందుస్థాన్ గతంలో నే అధికారుల దృష్టి కి తీసుకెళ్లిన చర్యలు తీసుకోకపోవడంతో, ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.

మురికి కాలువల అక్రమణల పై…..
మురికి కాలువలను, ప్రధాన కాలువను ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు నోటీసులు సైతం ఇచ్చిన అధికారులు, వాటి కూల్చివేత కు రంగంమంత సిద్ధం కూడా చేసుకున్నారు. అయితే అక్రమణలు కూల్చివేస్తూ మధ్యలో ఉన్నట్టుండి కూల్చివేత కార్యక్రమాన్ని నిలిపివేశారు. తరువాత ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అధికారులు ఈ విషయాన్ని మామూలు గా తీసుకుని కూల్చి వెత కార్యక్రమం ఆపివేశారా ❓️ లేదా మరే ఇతర కారణాల వల్ల ఆపేశారా అనేది ఇప్పటికి సామాన్యడుకి అర్థం కానీ రహస్యమే .
ఏదేమైనా ఇలా భారీ వర్షాలు కురుస్తున్నప్పడు మాత్రం ఇబ్బందులు పడుతున్నది మాత్రం సామాన్య ప్రజలే….

ఇచ్చోడా సుభాష్ నగర్ వార్డులో
గత కొన్ని రోజులుగా ఏడతెరిపిలేని వాన పడుతుండడంతో ఇచ్చోడలోని సుభాష్ నగర్ కాలనీకి చెందినటువంటి వార్డు సభ్యురాలు సుమిత్ర వానలో కూడా వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటూ వాళ్లకు తగు జాగ్రత్త చర్యలను తెలపుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీరు చేరడంతో వారి కి చేదోడు వాదోడుగా ఉంటానని, ఎప్పుడు అవసరం వచ్చినా తక్షణమే స్పందిస్తానని హామీ ఇస్తున్నారు .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments