కొనుగోలు కేంద్రాలలో రైతుల పడిగాపులు
తేమ శాతం పేరుతో తూకంలో కోత
కొనుగోలు జరగక రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలు వద్దే పడిగాపులు కాస్తున్న రైతులు ... పట్టించుకోని అధికారులు....
ఆరుగాల కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు... రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్ల ప్రమేయం లేకుండా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు... మిల్లర్లు, దళారులు ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా ఆ మేరకు రెవెన్యూ, వ్యవసాయశాఖ దృష్టి కేంద్రీకరించడం లేదు. ఫలితంగా ధాన్యం త్వరితగతిన మిల్లులకు చేరడం లేదు. ఆర్బీకేల సిబ్బందితో మిల్లర్లు, దళారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు..
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : మండలంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. కేంద్రాలు ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మాత్రం ఊపందుకోవడం లేదు. వానా కాలం సీజన్లో రైతులు పండించిన ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసిఆర్ సివిల్ సప్లయి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఐకేపీ, పీఏసీఎస్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. అధికారుల్లో సమన్వయ లోపంతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బంగాళఖాతంలో మండూస్ తుఫాన్ ఉగ్రరూ పందాల్చడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
సహకార సంఘాలతో రైస్ మిల్లర్ల కుమ్మక్కు
మండలంలో ప్రాథమిక సహకార సంఘాలు, రైసు మిల్లర్లు ఆడింది ఆట పాడింది పాటగ మారుతుంది. ధాన్యం కొనుగోళ్ల లో…. వాళ్ళు చేపిందే వేదంగా మారింది. అధికారులు మిల్లులకు దాన్యం కేటాయింపులు పూర్తిచేసిన.. హమాలీలు లేరనే సాకుతో ధాన్యం తరలింపునకు కొందరు రైసుమిల్లర్లుకొందరు రైసుమిల్లర్లు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నాన కష్టాలు పడుతున్నారు.
బస్తాకు మూడు నుండి నాలుగు కిలోల కోత
కొనుగోలు కేంద్రంలో ప్రతి సీజన్ లో 25 వేల క్వింటాళ్ల ధాన్యం వస్తుంది. ప్రతిరోజు నాలుగు లారీల ధాన్యం తుకమవుతుంది. కానీ నిబంధనల ప్రకారం కాకుండా మిల్లర్లు, కేంద్రాల నిర్వహకులు ఇష్టరితిన దోపిడీకి పాల్పడుతున్నారు. క్వింట ధాన్యానికి రెండున్నర కిలోల దరువు కొనుగోలు కేంద్రాలు తీస్తుండగా… రైస్ మిల్లుల నివాహకులు మరో 3 నుండి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతు ఆవేదన చెందుతున్నారు. సొసైటీలో అడ్డగోలుగా తూకంలో మోసం, తరుగు దొప్పిడి కొనసాగుతుందని రైతులు మండి పడుతున్నారు. ఇప్పటికైనా దోపిడీ వ్యవస్థ నిర్మూలించి తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments