అదిలాబాద్ జిల్లా:
అదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు ( cotton purchase CCI) నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు శుక్రవారం పత్తిని విక్రయించడానికి వాహనా ల్లో రైతులు భారీగా పత్తిని తీసుకువచ్చారు. నిలువ చేసిన పత్తి బేళ్ల సరఫరా నిలిచిపోయిందంటూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లను నిరాకరించారు.
ఉదయం 5 గంటల నుంచి రైతులు వాహనాల్లో పంట ను తీసుకురావడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పత్తి కొనుగోలు నిలిపి వేయ డంతో రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే పంట కొనుగోలను ప్రారంభించా లని కలెక్టర్ చొరవ తీసు కోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ శ్యామలాదేవి వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కొద్దిసే పట్లో పంటను కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు.
Recent Comments