రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద నకిలీ బంగారం , నకిలి నోట్లతో మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా నేరడిగొండ ఎస్సై సాయన్న తెలిపిన వివరణ ప్రకారం అదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మరియు ఉట్నూర్ ఏఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా ఉన్న ఒక కారు నెంబరు TS07 FU 7394 ను ఆపి తనిఖీ చేయగా అందులో ముగ్గురు మహారాష్ట్ర వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వారి వద్ద ఒక బ్యాగును తనిఖీ చేయగా అందులో బంగారం రంగులో ఉన్న వస్తువు సుమారు 1130 గ్రాములు, అలాగే ఒక వంద రూపాయల నోట్ల కట్ట వాటిపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్నది గుర్తించి వారిని అదుపులో తీసుకుని విచారించగా ఈ ముగ్గురితో పాటు ఇచ్చోడకు చెందిన ఇద్దరు అదిలాబాద్ కు చెందిన మరో ఇద్దరు మొత్తం ఏడుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచనతో బంగారం రంగులో గల వస్తువులను బంగారం అని నమ్మించి అమాయకుల వద్ద డబ్బులు తీసుకుని వారికి నకిలీ బంగారం ఇచ్చి మోసం చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
అందులో భాగంగా అదిలాబాద్ జిల్లా నేరడిగొండలో గత నెలలో ఒక వ్యక్తి వద్ద 2 లక్షల 30 వేలకు 10 తులాల బంగారం ఇస్తామని చెప్పి అతని వద్ద 30 వేల రూపాయలు తీసుకొని, మిగత డబ్బులు బంగారం ఇచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు మిగతా డబ్బులు ఇవ్వాలని చెప్పారు. అలాగే అదిలాబాద్ టౌన్ లో ఒక వ్యక్తికి ఇలాగే చెప్పి అతని వద్ద నుండి సైతం 80 వేల రూపాయలు తీసుకొని అతని నమ్మించి మోసం చేశారు.
ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్నటువంటి 1130 గ్రాముల బంగారం రంగులు గల చైనులను అలాగే ఒక వంద రూపాయల నోట్ల కట్టను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పిల్లలు ఆడుకునే నోట్ల కట్ట కింద ఒరిజినల్ నోట్లు పెట్టి బయట మార్కెట్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు నేరడిగొండ ఎస్సై తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments