రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం న్యూస్ : 2012 సంవత్సరం లో
దొంగ నోట్లు తయారు చేసి సరఫరా చేసే క్రమంలో పట్టుబడిన ఇద్దరు నేరస్తులకు ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి ఉదయ్ భాస్కర్ రావ్ నేరస్తులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ
తీర్పు వెలువరించారు.
*కేసుపూర్వపరాలు….*
2012 సంవత్సరం లో ఉట్నూర్ మండలం లో కేంద్రం లోని ఐబీ చౌరస్తా వద్ద వాహనాలను అప్పటి ఉట్నూర్ సిఐ పి కాశయ్య తనిఖీలు నిర్వహిస్తుండగా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాగు తో అనుమానస్పదంగా తిరగడం గమనించిన సిఐ వారివురిని బ్యాగులో ఏముందని విచారించగా 8లక్షల రూపాయలు కనిపించాయి. ఈ డబ్బు ఎక్కడిదని తమదైనా శైలిలో విచారణ చేయగా నేరస్తులు అయినా ఆదిలాబాద్ కి చెందిన అబ్దుల్ ఘని (29), షేక్ అప్రోజ్ (24) లు పట్టుబడిన డబ్బులో అసలు నోట్లు 4 లక్షలు మరియు నకిలీ నోట్లు నాలుగు లక్షలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. ఈ డబ్బును తక్కువ ధరకు ఉట్నూర్ మరియు కరీంనగర్ ప్రాంతాల్లో చెలామణి చేయడానికి వెట్లున్నట్లు నేరం ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్తుడు అబ్దుల్ ఘని ఇంటి నుండి దొంగ నోట్ల తయారీ పత్రాలను, పేపర్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును దర్యాప్తు చేసిన సిఐలు ఎస్ అచ్ఛేశ్వర్ ఆర్ రావు, సదన్ కుమార్, ఈ నరేందర్ లు ఛార్జిషిట్ దాఖలు చేయగా అదనపు పీపీ ఇ కిరణ్ కుమార్ రెడ్డి పది మంది సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టి నేరం రుజువు చేయగా చెయ్యగా ఆదిలాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి ఉదయ్ భాస్కర్ రావు నేరస్తులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 20 వేల రూపాయల జరిమానా విధించారు.
ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు విధుల అధికారి సిహెచ్ నరేందర్, లైజన్ అధికారి ఏఎస్సై ఎం గంగా సింగ్ మరియు పిపి లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments