పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కేయు ఎగ్జామినేషన్ కంట్రోలర్ అధికారులు
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్నటువంటి సెమిస్టర్ 3 మరియు సెమిస్టర్ 5 పరీక్షలలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూన్న 16 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు కాకతీయ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం రోజు ఆదిలాబాద్ , మంచిర్యాల జిల్లాల్లోని పలు పరీక్ష కేంద్రాలలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ పి మల్లారెడ్డి మరియు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రొపెసర్ డా.ఆరోళ్ల నరేందర్ తో కలిసి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
డిబార్ అయిన విద్యార్థులలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యార్థి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 02, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సాయి సామత్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 03 , ఇచ్చోడ కాకతీయ డిగ్రీ కళాశాలలో 05, రెబ్బెన మండలంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 03 , లక్సీట్ పెట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 01, మంచిర్యాల రిమ్స్ డిగ్రీ కళాశాలలో 02 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పట్టుబడినట్లు తెలిపారు.
Recent Comments