- కళాశాలల రిజల్ట్స్ కోసం యాజమాన్యాల తాపత్రయం....
- విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం... !
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : మాస్ కాపీయింగ్ తో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారా… !? రేపటి రోజు విద్యార్థుల మెమోరిలో జీరో డాటా ఉండేలా వారు చదువుకోకుండా కేవలం నకల్ చిట్టీల పైనే ఆధారపడేలా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను తయారు చేస్తున్నాయా….!?
అయితే ప్రస్తుతం జరుగుతున్న పరీక్ష వ్యవహార శైలి చూస్తే అదే నిజమనిపిస్తుంది.
ఇచ్చోడా మండల కేంద్రం లో ఉన్న నాలుగు పరీక్ష కేంద్రాలలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.
కళాశాల యాజమాన్యాలు ఒకరికొకరు నువ్వు నేను అన్న విధంగా మా స్టూడెంట్లకు మీ కళాశాలలో సెంటర్ ఉంది.. మీ స్టూడెంట్లకు మా కళాశాలలో సెంటర్ ఉంది.. మీరు మాకు సహకరించండి..మేము మీకు సహకరిస్తాం…అని ప్రైవేట్ కళాశాల యజమానులు ఒకరితో ఒకరు అండర్ స్టాండింగ్ తో డిగ్రీ పరీక్షలో మాస్ కాఫీయింగ్ నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ స్టూడెంట్లకు గత నాలుగు రోజుల క్రితం పరీక్షలు ప్రారంభమయ్యాయి. బోథ్ నియోజకవర్గంలో పాటు ఇచ్చోడ మండల కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవ్వడంతో పాటు తమ కళాశాల రిజల్ట్స్ ను చూపెట్టుకోవడం కోసం పరీక్ష కేంద్రాల్లో కళాశాల నిర్వహకులే మాస్ కాఫీయింగ్ కు సహకరిస్తున్నారని పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కుప్పలుగా పడి ఉన్న మినీ జిరాక్స్ నకల్ చిట్టిలే నిదర్శనం.
అధికారులను సైతం మేనేజ్ చేయడంతో పరీక్ష కేంద్రాలకు తనిఖీలకు వచ్చే ఉన్నతాధికారుల సమాచారం ముందస్తుగా కళాశాల నిర్వాహకులకు తెలిసిపోవడంతో విద్యార్థులను అప్రమత్తం చేస్తూ చేస్తున్నారని స్టూడెంట్లే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మాస్ కాఫీయింగ్ కు కళాశాల నిర్వాహకులు సహకరించడంతో స్టూడెంట్ల ఉన్నత చదువులు చదవడానికి కీలకమైన డిగ్రీలో కాఫీయింగ్ కొట్టి ఉత్తీర్ణులైతే ఉన్నత చదువుల్లో ఎలా రాణిస్తారని, స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని విద్యావేత్తలు చర్చించుకుంటున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments