రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
ఉపాధి కూలీలు చేసిన పనికి పూర్తి డబ్బులు ఇవ్వాలి అని బోథ్ గ్రామ ఉపాధి కూలీలు ఎంపిడిఓ కార్యాలయం ముట్టడి చేశారు. అక్కడ ఉన్న ఎంపిడిఓ దుర్గం రాజేశ్వర్, ఎంపీఓ జీవన్ రెడ్డి ను కార్యాలయం లోకి వెళ్లకుండా గేట్ ముందర కూర్చొని ఘెరవ్ చేశారు వివరాలు వెళ్తే బోథ్ గ్రామం లోకి ఉపాధి కూలీలు కి రూ. 257 రూపాయలు రావాలి కానీ తమకు రూ.140 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అని ఎంపిడిఓ కార్యలయం ముట్టడించారు.

ఇదే విషయం ఉపాధి హామీ ఏపిఓ ను సంప్రదించగ వాళ్ళు చేసిన పని కొలతలు తీసుకొని దానికి సరిపడా పేమెంట్ చేస్తున్నాం అని తెలిపారు. ఎంత చెప్పినా కూలీలు వినకుండా కార్యాలయం ముందు కూర్చొని లోపలికి సిబ్బంది వెళ్లకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Recent Comments