భూ మాఫియా కు బయపడి ప్రాణ భయంతో ఊరు విడిచి చేన్లలో ఉంటున్నా గ్రామానికి చెందిన 6 కుటుంబాలు….
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేక పోవడంతో ప్రాణ భయంతో గ్రామం వదిలి వెళ్లినట్లు మీడియాల్లో కథనం
రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ :
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ నేరెడిగోండ మండలం రాజులతాండ గ్రామంలో దారుణం జరిగింది. 2 ఎకరాల భూమి గ్రామానికి ఇచ్చేయాలంటూ గ్రామానికి చెందిన కొందరు తమపై బెదిరింపులకు పాలుపడుతున్నారని ఆరు కుటుంబాల ఆవేదన. వారి కి బయపడి ప్రాణ భయంతో ఊరు విడిచి వారి పొలంలో తాత్కాలికంగా గూడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న సదరు కుచుంబాలు.
పోలీసుల కు పిర్యాదు చేసిన రియల్టర్లకే వత్తాసు పలుకుతున్నట్లు మీడియా లో కథనం.
అది ప్రభుత్వ భూమి…. గ్రామస్తుల వాదన
ప్రభుత్వ భూమి కబ్జా…!❓️
నేరడిగొండ మండలం లో కలకలం రేపిన ఘటన పూర్వపరాలు….

అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని బుద్ధికొండ గ్రామపంచాయతీలోని రాజుల్ తండా హబిటేషన్ లో సర్వే నంబర్ 123 ప్రభుత్వ భూమిని దేవ్ సింగ్ అనే వ్యక్తి కబ్జా చేసినట్లు గత సంవత్సరం రాజుల్ తండా గ్రామస్తులంతా కలిసి స్థానిక నేరడిగొండ మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

దాంతో స్పందించిన అధికారులు పంచనామా నిర్వహించి ఈ సర్వే నంబర్ కు చెందిన భూమి ప్రభుత్వ భూమి అని సదరు వ్యక్తికి తెలియపరచి అప్పటికే ఆ భూమిలో విత్తనాలు వేసి సాగు చేసుకోవడంతో పంట చేతికి వచ్చే వరకు సాగు చేసుకోమని చెప్పి అధికారులు వెనుదిరిగారు…
ఈ సంవత్సరం గ్రామస్తులంతా కలిసి సదరు వ్యక్తి దేవ్ సింగ్ కి ఇప్పటి నుండి ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటదని చెప్పారు.. దాంతో దేవ్ సింగ్ ఇది నా భూమి మీకు దిక్కు ఉన్న చోటు చెప్పుకో మని దుర్భరమైన భాషతో సమాధానమిస్తున్నట్లు గ్రామస్తుల వాదన. పలుమార్లు తహసీల్దార్ సిల్దార్ కి ఈ విషయం గురించి చెప్పిన ఎలాంటి స్పందన ఇవ్వట్లేదని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.


Recent Comments