రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
బుధవారం రోజు ఇచ్చోడా పట్టణ సమీపంలోని జాతీయ రహదారి 44 పై జరిగిన రోడ్డు ప్రమాదం లో నర్సాపూర్ విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా పని చేస్తున్న రాసోట్కార్ నారాయణ (70) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
పోలీసులు మరియు కుటుంబం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన నారాయణ ఇచ్చోడా మండలం లోని నర్సాపూర్ గ్రామం విధ్యుత్ సబ్ స్టేషన్ విద్యుత్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం డ్యూటీ కోసం ఉదయం తన ద్విచక్ర వాహనం టీవీఎస్ ఎక్సెల్ AP01R7735 పై మన్నూర్ నుండి ఇచ్చోడా వైపు బయలుదేరి వస్తుండగా ఇచ్చోడా సమీపంలో రాగానే వెనుక నుండి అతి వేగంగా వస్తున్న ఐచర్ వాహనం MH34 BG 3054 నెంబర్ గల వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన లో రాసోట్కార్ నారాయణ కు తలకు మరియు కాళ్ళకు తీవ్రగాయలయ్యాయి. 108 అంబులెన్సు లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Recent Comments