రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షేమ దేశ్పందే కు విన్నవించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆజాదిక అమృత మహోత్సవంను పురస్కరించుకుని న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో మంగళవారం చేపట్టిన న్యాయ విజ్ఞాన సదస్సు లో సంస్థ కార్యదర్శి క్షేమ దేశ్పాండే పాల్గొన్నారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3250 మంది రైతుకు కింగ్ కంపెనీ 101 రకం పత్తి విత్తనాలను వేసి నష్టపోయారని తెలిపారు.
అయితే వీరికి వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం చేయాలని కోరారు. దింతో స్పందించిన జడ్జిలు నష్టపోయిన రైతుల వివరాలను తీసుకొని న్యాయ సేవ సంస్థను సంప్రదించాలని వివరించినట్లు తెలిపారు.
అటు ఒక్క బేల మండలంలోనే 1496 మంది రైతులు నష్టపోయారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు న్యాయవాదులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Recent Comments