
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : భారత రాజ్యాంగాన్ని మార్చాలి, నూతన రాజ్యాంగాన్ని తీసుకురావాలని ముఖ్య మంత్రి కెసిఆర్ చేసిన వాక్యాలకు నిరసనగా సిరిచెల్మ గ్రామం లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం దళిత బహుజన సంఘాల అధ్వర్యంలో ముఖ్య మంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. భారత రాజ్యాంగం కల్పించి న హక్కుల వాళ్ళ అనేక పదవులు పొంది, రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిన వ్యక్తి అలాంటి దిగజారుడు వాక్యాలు చేయడం సరి కాదని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Recent Comments