రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండలంలోని దాబా కె గ్రామములో ఈ నెల 17 వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్న 65 వ అశోక విజయ దశమిని పురస్కరించుకుని ధమ్మ చక్ర ప్రవర్ధన్ కార్యక్రమానికి బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావును డాబా కె గ్రామస్తులు ఆహ్వానించారు.
అదిలాబాద్ లోని తన నివాసములో కలసి జేత్వాన్ బుద్ధ వివహర్ సమితి దాబా కె తరుపున గ్రామస్థులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమములో దాబా కె ఉప సర్పంచ్ గాయకాంబ్లీ గణేష్, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్, వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా, దాసరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..
Recent Comments