రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామంలో మేత కోసం వెళ్ళిన అయిదు ఎద్దులపై విద్యుత్ స్తంభం విరిగి పడడంతో అక్కడిక్కడే మృతి చెందాయి. చనిపోయిన ఎద్దుల విలువ 2 లక్షలకు పైగా ఉంటుందని రైతులు తెలిపారు.
ఒక్కసారిగా విద్యుత్ స్థంభం పడడం తో వైర్ల కింద మూగ జీవాలు అసువుల్బాసాయి. ఖరీఫ్ సీజన్ కు ఒకటే నెల ఉండగా ఇలా ఎడ్లు మృతి చెందడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు షేక్ అలీ మరియు ఇతర రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
విరిగిపడిన స్థంభం నాసిరక నిర్మాణంతో చేసినట్లు కనిపిస్తుంది.
Recent Comments