Thank you for reading this post, don't forget to subscribe!
వెబ్ డెస్క్ : ఆఫ్రికా నైజీరియాలోని బెన్యూ రాష్ట్రం ఉమోగిడిలో కొందరు దుండగులు నరమేధానికి పాల్పడ్డారు. ఓ మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి సహా 47 మంది మరణించారు. పంటలు సమృద్ధిగా పండే బెన్యూలో పశువుల కాపరులు, రైతుల మధ్య జరుగుతున్న భూ వివాదమే కాల్పులకు కారణమని అధికారులు భావిస్తున్నారు. పశువుల కాపరులే కాల్పులు జరిపారని అనుమానిస్తున్నారు.


Recent Comments