Friday, February 7, 2025

ఆశా కార్యకర్తనా !?… ఆరోగ్య కార్యకర్తన….!?

నిలబడి వ్యక్తికి కోవిడ్ టీకా వేస్తున్న దృశ్యం …. ఈ ఫొటో ఎక్కడిదో తెలియదు ( నెట్టింట్లో వైరల్ అయిన ఫొటో ఇది )

కోవిడ్ మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.

అయితే ఒక ఫొటో మాత్రం తెగ వైరల్ అవుతుంది. పైన ఫొటోలో ఓ వ్యక్తి కి నిలబెట్టి వ్యాక్సిన్ చేస్తున్న ఫొటోలో వాక్సిన్ చేస్తుంది ఆశ కార్యకర్తనా !? లేక ఆరోగ్య కార్యకర్తన అనేది స్పష్ఠత లేదు. వాక్సిన్ ప్రోగ్రెస్ కోసం ఇలా ఎక్కడబడితే అక్కడ నిలబెట్టి వాక్సిన్ చేయడం ఏంటని జనం మాట్లాడుకుంటున్నారు.

సాధారణంగా ఆశ కార్యకర్తలు కోవిడ్ కేంద్రాల్లో చురుకుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మనం చూస్తూ ఉంటాం సమయానికి వైద్య సిబ్బంది రానట్లయితే అక్కడ పనిచేసే అటెండర్ కానీ ఇతర కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ మందులు ఇవ్వడం చాలాసార్లు చూశాం. కానీ వ్యాక్సిన్ ఇవ్వడం అంటే మనం ఇదే మొదటిసారి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి అనుభవం లేకుండానే ఆశా కార్యకర్త వ్యాక్సిన్ ఇస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్త లేనట్లయితే అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గాని లేదా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనైతే వైద్యాధికారి కాని ఎవరినో ఒకరిని ఆరోగ్య కార్యకర్త ను ఏర్పాటు చేసి ఆశ సహాయం తో వ్యాక్సిన్ ఇవ్వాలి. కానీ అక్కడ అధికారులకు అదేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఆశ కార్యకర్త వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు అంటే వైద్యం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది..ప్రస్తుతం ఈ ఫోటో వాట్సాప్ గ్రూపు లో వైరల్ అవుతుంది. ఈ ఆశ కార్యకర్త ఏ జిల్లాకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందింది ఏ సబ్ సెంటర్ ఏ గ్రామంలో వ్యాక్సిన్ ఇస్తున్న అన్న విషయం ఇంకా తేలవలేదు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!