పశ్చిమ బెంగాల్‌లోనిఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
Thank you for reading this post, don't forget to subscribe!బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ హింసకు దారి తీసింది. టీఎంసీ నేతల అగడాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను పరామర్శించడానికి బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు సందేశ్‌ఖాలీ సందర్శన బయలుదేరారు.
ఈ క్రమంలో సందేశ్‌ఖాలీకి బీజేపీ కార్యకర్తలను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమం పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ స్పృహ తప్పి పడిపోయి గాయపడ్డారు. వెంటనే అతన్ని స్థానిక అస్పత్రికి తరలించారు. అతనికి మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాకు తరలించినట్లు తెలుస్తోంది. ఇక.. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు అక్కడి మహిళపై అఘాయిత్యాకు పాల్పడున్నారని గత కొన్ని రోజులుగా వారు మమతా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Recent Comments