Thank you for reading this post, don't forget to subscribe!
▪️మండల కేంద్రంలో విద్యానగర్, సాయినగర్ కాలనీల్లో చోరికి విఫలయత్నం ▪️అనుమాస్పద బ్యాగులు స్వాధీనం చేసుకున్న పోలీసులు ▪️వరస ఘటనలతో భయాందోళనలో ప్రజలు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: జిల్లా లోని ఇచ్చోడ మండలంలో హడలెత్తిస్తున్న చెడ్డి గ్యాంగ్ దొంగలు. మండల కేంద్రంలో శుక్రవారం విద్యానగర్, సాయినగర్ కాలనీనిలో రెండు ఇళ్ల తలుపులకు డ్రిల్ చేసి ఇళ్లలో చొరబడే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు మేల్కోవడంతో పోరారైనట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండు రోజులలో మూడు ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగలను పట్టుకోవడం కోసం నాలుగు బృందాలతో కొనసాగుతున్న ఆపరేషన్ కొనసాగుతోంది. గత రెండు రోజులలో జైనథ్, బోథ్ మండలాలలో దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడడంతో ప్రజలు ఆపరా భయాందోళన చెందుతున్నారు. జైనథ్, బోథ్ మండలాలలో సీసి కెమెరాల్లో రికార్డైనా దృశ్యాలతో వారు చెడ్డి గ్యాంగ్ నా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..జైనథ్, బోథ్ మండలాలలో సీసి కెమెరాల్లో రికార్డైనా దృశ్యాలతో వారు చెడ్డి గ్యాంగ్ నా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇచ్చోడ మండల కేంద్రంలో ఘటన జరిగిన ప్రదేశంలో ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు ఆధ్వర్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే ఓ నిర్మాణం లో ఉన్న ఇంటి వద్ద అనుమానాస్పద బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.


Recent Comments