రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : సోమవారం రోజు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2021 లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలం లో గ్రామపంచాయతీలు కౌట( బి ), చింతలబోరి పరిశీలించడానికి ఢిల్లీ బృందం సభ్యులు వచ్చారు. ఢిల్లీ నుండి సంతోష్ మరియు సునీల్ జూనియర్ అస్సేసర్ లు గ్రామపంచాయతీ ల్లో పర్యటిస్తూ గ్రామం లో నిర్మించి నటువంటి మరుగుదొడ్లను, ఇంకుడు గుంతలను, తడి చెత్త పొడి చెత్త నిర్వహణలను, ఎరువు తయారీ, గ్రామపంచాయతీ ట్రాక్టర్ నిర్వహణ పరిశీలించారు.
అనంతరం వారు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఉద్యానవనం, మరియు హరితవనం చూసి సిద్దిపేట తర్వాత ఇంతటి పచ్చదనం బోథ్ మండలం లోని ఉందని అభినందించారు. అధికారుల వెంట సర్పంచ్ రాధిక గంగాధర్ , ఎంపిడిఓ రాధా రాథోడ్, ఎంపిపి తుల శ్రీనివాస్ ఎంపిపి, పిఎసిఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent Comments