క్యాన్సర్ అదో మాయదారి మహమ్మారి, ఆ పేరు వింటేనే పేదవారికి ప్రాణాలు పోయేంత పని, స్థోమత వున్నవారైనా లేని వారైనా క్యాన్సర్ అంటేనే జంకుతారు. దానికయ్యే కర్చు బరించే స్థోమత లేక అల్లాడిపోయి సాయం కోసం చేతులు చాస్థూ అవస్థలు పడుతుంటారు. సాయం అందినా ఎక్కడ చూపించక తెలియక పోయినా ప్రానాలెన్నో ఉన్నాయి. అయితే పేద వారికి ఆర్థికంగా కర్చు భరించ లేని వారి కోసం ఓ పథకాన్ని అమలు చేస్తుంది. దాని గురించి తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం పేద క్యాన్సర్ రోగులకు వారి వైద్యానికయ్యే ఖర్చుకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం చేసే ఒక పథకాన్ని అమలు చేస్తోంది.
అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం లేక ప్రజలు దీనిని వినియోగించు కాలేక పోయారు.
ఈ పథకాన్ని రాష్ట్రీయ ఆరోగ్య నిధి – హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ పేరిట కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తుంది.
రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం
పేదల్లో ఎవరైనా క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే అలాంటి రోగులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం ప్రవేశపెట్టరు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సక్షేమ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఈ పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రీయ ఆరోగ్య నిధిలో భాగంగానే *ఆరోగ్య మంత్రి క్యాన్సర్ రోగుల నిధి* (హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ – Health Minister’s Cancer Patient Fund)ని ఏర్పాటు చేశారు. దీని ద్వారానే చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
క్యాన్సర్ రోగికి ఇచ్చే ఆర్థిక సహాయం
క్యాన్సర్ రోగికి చికిత్స కోసం ఈ పథకం కింద రూ.2లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. అయితే అంతకంటే ఎక్కువ డబ్బు అవసరమైతే ఆ దరఖాస్తులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపుతారు.
కేంద్ర మంత్రిత్వ శాఖ క్యాన్సర్ రోగి పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాత అవసరాన్ని బట్టి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.
కేంద్ర ఇచ్చే 2 లక్షల రూపాయల సాయమైనా, గరిష్ఠంగా ఇచ్చే రూ.15లక్షల సాయమైనా సరే ఆ క్యాన్సర్ రోగి చికిత్సకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ ఆర్థిక సహాయం తో క్యాన్పర్ రోగి చేసుకునే చికిత్సలు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును క్యాన్సర్ రోగి ఈ కింద చికిత్సలకు ఉపయోగించుకోవచ్చు
1.రేడియేషన్
2.యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ
3.బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్
4.రోగ నిర్ధారణ పరీక్షలు
5.క్యాన్సర్ గడ్డల ఆపరేషన్
ఈ పథకం పొందడానికి ఎవరు అర్హులు …!?
A. కేంద్ర ప్రభుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి.
B. రేషన్ కార్డు లేదా వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం సంబంధిత ఎమ్మార్వో నుంచీ పొంది ఉండాలి.
C. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ధ్రువ పత్రాలుండాలి.
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసుకుంటే ఈ ఆర్థిక సహాయం వర్తించదు. క్యాన్సర్ రోగులకు సంబంధించి దేశంలో 27 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలున్నాయి. వీటిలో మాత్రమే చికిత్స చేయించుకుంటేనే వర్తిస్తుంది.
లేదా
టెరిటరీ క్యాన్సర్ సెంటర్లు, లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోని క్యాన్సర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న రోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఇంతకు ముందు చికిత్స కోసం అయిన ఖర్చుకు ఈ డబ్బు వినియోగించడం కుదరదు, ఇంతకు ముందే చికిత్స చేసుకున్నప్పటికీ ఆ ఖర్చులకు ఈ డబ్బు ఇవ్వరు.
కేవలం ప్రస్తుతం అందుతున్న చికిత్సకు మాత్రమే డబ్బులు అందజేస్తారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నఆరోగ్య బీమా పథకాలు ఆయుష్మాన్ భారత్ – ప్రైమ్ మినిస్టర్ జన ఆరోగ్య యోజన (Ayusman Bharat – Pradhan Mantri Jan Arogya Jojna (PMJAY) పథకంలో మీరు సభ్యులైన వారికి కూడా ఈ పథకం వర్తించదు.
కానీ ప్రధాన మంత్రి జాతీయ ఉపశమన నిధి (Prime Minister’s National Relief Fund (PMNRF) సాయం పొందిన రోగులకు ఈ పథకం వర్తిస్తుంది. కానీ ఈ రిలీఫ్ పండ్ నుంచీ పొందిన మొత్తాన్ని ఈ పథకం నుంచీ మంజూరు చేసిన మొత్తంలో కోత విధించి మిగిలింది క్యాన్సర్ రోగి చికిత్సకు ఉపయోగిస్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఈ పథకానికి అర్హులు కారు.
కేవలం నిరుపేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
దరఖాస్తు చేసుకున్న నెల లోపే కేంద్ర ప్రభుత్వo అన్ని పరిశీలించి రోగి చికిత్సకు డబ్బు మంజూరు చేస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండింటికీ కలిపి రీజినల్ క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్‌లో ఉంది.
హైదరాబాద్ చిరునామా : MNJ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, MNJ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్. రెడ్ హిల్స్, లక్డీకాపూల్ , హైదరాబాద్ -500004, తెలంగాణ-ఫోన్ : 040-23318422 / 414 / 424 / 23397000
టెలీఫ్యాక్స్ : 040-23314063
ఈమెయిల్ : info@mnjiorcc.org director@mnjiorcc.org
dirmnjiorcc@yahoo.com
*ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడమెలా?*
ముందుగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్‌సైటులో దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడు చేసుకోవాలి.
ఈ కింద ఇచ్చిన లింక్‌లో ఈ దరఖాస్తు లభిస్తుంది.
దరఖాస్తును పూర్తీగా అడిగిన మేరకు వివరాలతో నింపాలి
ఈ దరఖాస్తును రోగికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ లేదా మెడికల్ ఆఫీసర్ లేదా ఆసుపత్రి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ నుంచి స్టాంపుతో కూడిన సంతకం తీసుకోవాలి.
ఇలా పూర్తి చేసిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వానికి అందేలా కింది చిరునామాకు పంపాలి,
*ఢిల్లీ కేంద్రం చిరునామా*
సెక్షన్ ఆఫీసర్, గ్రాంట్స్ సెక్షన్
మిన్సిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్,
రూమ్ నం.541, ఎ-వింగ్, నారీమన్ భవన్,
న్యూదిల్లీ-110011.
ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే సంప్రదించాల్సిన
ఈ-మెయిల్ : so.grants-mhfw@nic.in
ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం మీకు తెలిసిన అర్హతలు కలిగిన క్యాన్సర్ రోగుల ఉంటే సహాయపడoడి.
వ్యాసకర్త – గాజుల రాకేష్, 9951439589.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments