Friday, November 22, 2024

సీసీటీవీ నిఘాలో ఆదిలాబాద్ జిల్లా

▪️సీసీటీవీ ల పనితీరు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా మరియు ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి▪️ఎటువంటి సంఘటనలు అయినా జిల్లా కేంద్రంలో నుండి పరిశీలన▪️265 కెమెరాలను 24 గంటల నిరంతర పరిశీలన▪️ఆదిలాబాద్ పట్టణంలోనే 180 సీసీటీవీ కెమెరాలు.

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లా కేంద్రంలోని సిసిటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ మరియు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి కలిసి సందర్శించడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ప్రత్యేకతలను, పోలీసులు అవలంబిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ కు ఎస్పీ వివరించారు. పట్టణంలో ప్రత్యేకంగా ఈ చలాన్స్ కు ఏర్పాటు చేసిన 20 సీసీటీవీ కెమెరాలను, వాటి పనితీరు, ఈ చలాన్ వేయు పద్ధతిని మరియు ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ లాంటి వాటిని సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి చలాన్స్ వేయడం జరుగుతుందని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో 265 సీసీటీవీ కెమెరాలు పట్టణంలో 180 సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయని, జిల్లాకు చెందిన సీసీటీవీ కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు.

ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తుగా సీసీటీవీ కెమెరాలను చూస్తూ హెచ్చరించడం, జరిగిన నేరాలు కానీ, నేరస్తులుగాని తిరిగిన ప్రదేశాలను గమనించడానికి వారిని పట్టుకోవడానికి సీసీటీవీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో సీసీటీవీ కెమెరాల లో ప్రమాద తీరును పరిశీలించి మరల ఆ ప్రమాదాలు సంభవించకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని పరిశీలించడం జరుగుతాయి. జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ సీసీటీవీ కెమెరాల పనితీరును, వాటిని పరిశీలించే తీరును తెలుసుకొని జిల్లా పోలీసులను అభినందించారు. పట్టణంలోని కెమెరాల పనితీరుపై ప్రతిరోజు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పించడం జరుగుతుందని, పనిచేయని వాటిపై 24 గంటల లోపు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి, టెక్నీషియన్ కు తెలియజేసి బాగు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐఏఎస్ డాక్టర్ శ్రీజ, ట్రాఫిక్ సీఐ కొంక మల్లేష్, కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి