• విశ్వసనీయ సమాచారం మేరకు రెండు వాహనాలు సీజ్
• దాదాపు 150 బ్యాగుల్లో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న ఫర్టిలైజర్
• ప్రభుత్వ అనుబంధ సంస్థ హకా ఉద్యోగుల అక్రమ నిర్వాకం
• రైతుల సమాచారంతో పక్కాగా దాడి చేసి రెండు వాహనాలను పట్టుకున్న జైనథ్ పోలీసు సిబ్బంది.
• 150 బ్యాగు లు (దాదాపు 68 క్వింటాల్ )ల ఫర్టిలైజర్ మహారాష్ట్రకు తరలిస్తున్న నిందితులు.
– ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: ప్రభుత్వం సబ్సిడీ ఫర్టిలైజర్(యూరియా) ను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురి నిందితులు
1) సునీల్ – HACA(హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ )ప్రోప్రైటర్.
2) అజయ్ – హాక ఉద్యోగి.
3) నిఖిల్ – మహారాష్ట్ర ఫెర్టిలైజర్ దుకాణం యజమాని.
4) వాంకటే దిలీప్ – వాహన డ్రైవర్.
5) చిలకలవార్ చంద్రశేఖర్ – వాహన డ్రైవర్ అనే ఐదుగురి పై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం …..
ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న ఫర్టిలైజర్ ను, తెలంగాణ రైతులకు అమ్మకుండా, అక్రమంగా మోసపూరితంగా వ్యవహరించి బాధ్యతగల హాకా నిర్వాహకులు మహారాష్ట్రకు అధిక ధరలకు అధిక లాభార్జనకు అమ్ముతున్నట్లు రైతుల ద్వారా లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు రెండు వాహనాలను సీజ్ చేసి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. బేల మండలం నందు మార్క్ఫెడ్ అనుబంధ సంస్థ హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా HACA) ప్రొప్రైటర్ నిందితులు సునీల్, మరియు ఉద్యోగి అజయ్ లు మహారాష్ట్రకు సంబంధించిన ఫెర్టిలైజర్ దుకాణం యజమాని నిఖిల్ తో ఒప్పందం కుదుర్చుకొని దాదాపు మూడు లక్షల విలువచేసే ఫెర్టిలైజర్ను రెండు వాహనాలలో 150 బ్యాగుల్లో యూరియా ను అక్రమంగా తరలిస్తుండగా ఆ రెండు వాహనాలను సీజ్ చేసి, వాహన డ్రైవర్లైన వాంకడే దిలీప్, చిలకలవార్ చంద్రశేఖర్లపై, మొత్తం ఐదుగురిపై బేలా పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు. ప్రత్యేకంగా రైతుల ద్వారా సమాచారం అందగా త్వరితగతిన స్పందించి జైనథ్ సిఐ డి.సాయినాథ్ మరియు బేల ఎస్సై నాగనాథ్ బృందం వారిని పట్టుకోవడం జరిగిందని, ఆదిలాబాద్ డిఎస్పీ ఎస్ జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను వెల్లడించారు. వీరిపై సెక్షన్లు 316, 318 BNS ప్రకారం బేల పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రెండు వాహనాల నంబర్లు MH29M1958, AP01U5172 ఈ రెండు వాహనాలలో 150 బ్యాగుల్లో దాదాపు 67.5 క్వింటల ఫర్టిలైజర్ ను మహారాష్ట్రకు తరలించకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అడ్డుకొని నిర్వాహకులపై కేసు నమోదు చేసిందని తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఐపీఎస్ గారు సూచనల మేరకు అక్రమంగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, బేల ఎస్సై నాగనాథ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments