• ఇదివరకే ఒకసారి కేసు నమోదు అరెస్టు అయిన డాక్టర్
– ఇచ్చోడా సీఐ బండారి రాజు
ఆదిలాబాద్ జిల్లా : ఇచ్చోడ మండల కేంద్రంలో యువతిని వేధిస్తున్న ఆర్‌ఐఎంఎస్ డాక్టర్ సయ్యద్ ఆసిమ్ ( 41 ) పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడా సీఐ బండారి రాజు తెలిపారు.

సిఐ తెలిపిన వివరాల ప్రకారం ….
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ఓ యువతిని నిరంతరం వేధింపులకు గురిచేస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి షేక్ అబ్దుల్ రెహమాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇచ్చోడలోని టీచర్స్ కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ (52) తన కుమార్తె ను నిందితుడు *సయ్యద్ ఆసిమ్* (45) అనే వ్యక్తి నాలుగు నెలలుగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆసిమ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని పేర్కొన్నారు.
అబ్దుల్ రెహమాన్ గతంలో కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, అప్పుడు కేసు కూడా నమోదైందని తెలిపారు. అయినప్పటికీ, సయ్యద్ ఆసిమ్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని, గత 12 రోజులుగా అతను తన కుమార్తెను నిరంతరం వెంబడిస్తూ, తమ బంధువులు, పొరుగువారు మరియు గ్రామస్తుల ముందు తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని బహిరంగంగా ప్రకటిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ చర్యల వల్ల తమ కుటుంబ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని, తమ కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని అబ్దుల్ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సయ్యద్ ఆసిమ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
ఈ ఫిర్యాదులోని అంశాల ఆధారంగా, పోలీసులు క్రైమ్ నంబర్ 219/2025 కింద భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 74, 79 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments