రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్ సమీక్ష సమావేశం లో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి దేవాదుల ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన రంగయ్య చెరువు ద్వారా 36000 ఎకరాల ఆయకట్టు కి సాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా నిర్మించిన కాలువ నిర్మాణం పనులు నాలుగేండ్లుగా నత్తనడకన సాగుతున్న క్రమంలో పూర్తి ఆయకట్టు కి నీళ్లు అందించడానికి కాలువల నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయించాలని అందుకు నిధులు కూడా త్వరగా మంజూరు చేయాలనీ కోరడం జరిగింది.ఇట్టి విషయాన్నీ వక్రీకరించి చౌకబారు రాజకీయాలకి అలవాటు పడిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యే దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ రంగాయ చెరువు పరిసర గ్రామాల ప్రజలలో అపోహ సృష్టించి వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.రంగాయ చెరువు పరిసర గ్రామాల ప్రజలకి తెలియ జేయునది ఏమనగా రంగాయ చెరువు రిజర్వాయర్ పునర్ నిర్మాణం చేయించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని,రంగాయ చెరువు కాలువల నిర్మాణం ద్వారా పూర్తి ఆయకట్టు కి సాగునీరు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఒక్క ఇల్లు మునిగిన,ఒక్క ఎకరం భూమి మునిగిన స్థానిక శాసన సభ్యుడిగా నాదే పూర్తి భాద్యత అని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది, రంగాయ చెరువు పరిసర గ్రామాల ప్రజలు తప్పుడు వార్తల్ని నమ్మి భయోందోళనలకి గురి కావద్దని కోరడం జరిగింది ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ జిల్లా మునిందర్,ఏడాకుల సంపత్ రెడ్డి ,మాలోతు చరణ్ సింగ్ ,పురుషోత్తం సురేష్ ,కర్దురి కట్టయ్య జెట్టి రాంమూర్తి ,బత్తిని మల్లయ్య ,బత్తిని మహేష్ ,పెంతల కొమురా రెడ్డి,గుండాల రాజా కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: చిట్యాల తిరుపతిరెడ్డి
RELATED ARTICLES
Recent Comments