రిపబ్లిక్ హిందూస్తాన్ : ఏటూరునాగారం , జయ శంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ రావడం తో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనల చెందుతున్నారు. సెప్టెంబర్ ఒకటి నుండి బడి ప్రారంభించింది మన తెలంగాణ సర్కారు . థర్డ్ వేవ్ పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు సైతం మన రాష్ట్ర వైద్యాధికారి అలాంటివి ఏమి లేదని అన్నారు. తీరా సెకెండ్ వేవ్ లో కూడా ఇలాగే ఒకటి రెండు కరోనా పాజిటీవ్ కేసులతో ప్రారంభమైన కరోనా తర్వాత దేశ వ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది.
ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం ప్రభుత్వ పాఠశాల పునప్రారంభం అయిన రెండో రోజే భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులక కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారం. ఏటూరునాగారం జిల్లా పరిషత్ పాఠశాలలో మొదటి రోజు 120 మంది, రెండో రోజు 210 మంది స్టూడెంట్లు హాజరయ్యారు. రెండు రోజులుగా క్లాస్లు తీసుకుంటున్న ఇద్దరు టీచర్లకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనపడడంతో గురువారం టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. ఇద్దరు టీచర్లను హోం ఐసోలేషన్కు పంపినట్లు ఎంఈవో చెప్పారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం ప్రైమరీ పాఠశాల హెచ్ఎంకు జ్వరం రావడంతో పాటు వాసన, రుచి పోయింది. కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది.


Recent Comments