ePaper
Friday, March 13, 2026
📄 ePaper

అన్ని వర్గాల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం… : ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఈ రోజు ఆదిలాబాద్ లోని తన నివాసములో బోథ్,ఇచ్చోడ,నెరదిగొండ,బింపూర్ మండలాలకు చెందిన 29 మందికి ముఖ్యమంత్రి సహాయనిది నుండి లబ్ధిదారులకు ఏడూ లక్షల తొంబై మూడు వే రూపాయల చెక్కులను బోథ్ బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశములోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథములో కొనసాగుతుందని అన్నారు.

ప్రజలు ఆరోగ్యముగా ఉన్నపుడే అసలైన అభివృద్ధి పథములో ముందుకు సాగుతారనే ఉద్దేశముతో ఆసుపత్రి విషయమై ఆర్థికభారం కాకూడదని సదుద్దేశముతో ముఖ్య మంత్రి సహాయనిది నుండి యాభై నుండి అరవై వెయిల రూపాయలు ఇవ్వడం సీఎం గారి గొప్పతనానికి నిదర్శనం అని అన్నారు.

సీఎం సహయనిధి చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్

గత రెండున్నర సంవత్సరాల నుండి 706 మందికి 2 కోట్ల 11 లక్షలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎల్లవేళలా ప్రభుత్వానికి, కేసీఆర్ పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమములో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, కన్వీనర్లు ఏనుగు కృష్ణ రెడ్డి,రుక్మాన్ సింగ్, నాగయ్య యాదవ్, ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, వెంకటేష్ మరియు రాజు, రాథోడ్ ప్రకాష్, దాసరి భాస్కర్,కుంట కిరణ్ , చంద్ర శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!