◾️ బాధిత కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, చెన్నారావుపేట : మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన చంద్ర శేఖర్ మెకానిక్ పని చేసుకుంటు జీవనం కొనసాిస్తామన్నాడు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో నడుము మరియు కాళ్ళు చచ్చుపడి మంచానికే పరిమితం అయ్యాడు. హాస్పిటల్ ఖర్చులు ఇప్పటికే సుమారు రూ.5 లక్షల వరకు అయ్యాయి. నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ పోషణ మరియు వైద్య ఖర్చులు భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా వివరాలు తెలుసుకున్న నర్సంపేట నియోజకవర్గం బిజెపి నాయకుడు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు అతని మిత్ర బృందం కలిసి బాధిత కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి చెన్నారావుపేట మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్, యాకయ్య చంద్రమౌళి ఉప్పలయ్య అనిల్ సునీల్ రంజిత్ విజయ్, పాపయ్యపేట గ్రామ పెద్దలు యువకులు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
Recent Comments