🔶 చినుకు పడితే చిత్తడవుతున్న తాత్కాలిక రోడ్డు
రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : మండల కేంద్రం నుంచి జాతర్ల వెళ్లే దారిలో పురాతన వంతెన కూల్చి వేసి కొత్త వంతెన పనులు మొదలు పెట్టారు. వర్షాలు కురవడం తో నిర్మాణ పనులు ఆపి వేశారు. ఈ సందర్బంగా బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలీక మొరం రోడ్డు వేశారు. కురుస్తున్న వర్షానికి మొరం కొట్టుకపోయి, బురద మిగిలింది. దింతో ఈ రోడ్డుగుండా వెళ్లే వాహన దారులకు రోడ్డు చాలా ఇబ్బంది కరంగా మారింది.
బుధవారం మండలంలోని జాతర్ల, బుతాయి, డేగమా, టెంబి, బోసరా, రాంపూర్ తదితర గ్రామాల రైతులు జొన్న పంటను అమ్ముకోవడానికి ట్రాక్టర్లలో బొలెరో వంటి వాహనాలలో బోథ్ మార్కెట్ యార్డ్ కు తరలిస్తుండగా రైతుల వాహనాలు బురదలో చిక్కుకపోవడం తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో పక్క పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు కూడా బురద లో ఇరుక్కపోవడంతో విద్యార్థులు వాహనాలు దిగి కాలినడకన వెళ్లారు. ఇకనైనా సంబందిత అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డు ను మరమ్మత్తులు చేసి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


Recent Comments