రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చొడ : ఇచ్చోడ మండలంలోని జల్దా గ్రామానికి చెందిన వ్యక్తి తన కూతురికి బట్టలు ఇవ్వడానికి వెళుతూ ఆటో బోల్తా పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇచ్చోడ ఏఎస్ఐ లింబాజి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జల్దా గ్రామానికి చెందిన నర్వాడే భగవాన్ ( 40) శుక్రవారం రోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తన కూతురూ నికితకు బట్టలు ఇచ్చి రావడానికి ఇంటి నుండి బయల్దేరి వెళ్ళాడు. హాస్టల్ కు వెళ్లాడని ముఖ్రా గమమనికి చెందిన ఆటోలో వెళ్తున్న క్రమంలో ఆటో బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో భగవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన 108 అంబులెన్స్ లో జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆటో డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా ఆటో నడపడం వల్ల పాఠశాల సమీపంలో వెళ్ళగానే బోల్తా పడిందని, దీనివల్ల భగవాన్ కు బలమైన దెబ్బలు తగలడంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆదిలాబాద్ తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడని మృతుని బంధువులు తెలిపారు. నిర్లక్ష్యంగా ఆటో నడిపిన వ్యక్తి పై చర్య తీసుకోవాలని మృతిని భార్య నర్వాడే కవిత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Recent Comments