కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పీ వి ఉమేందర్
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైం :
గురువారం రోజు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఏటీఎంలో పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా వివరాలను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో
ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్ పాత్రికేయుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…..
గురువారం రోజు ఉదయం 4 గంటల సమయంలో ఏటీఎం మెషిన్ ను మొహమ్మద్ ఏజాజ్ రాడ్ తో పగలగొట్టడంతో బూత్ నుండి శబ్దం రావడంతో పోలీసులు గమనించి అక్కడికి చేరుకునే లోపు నిందితుడు పోలీసు పార్టీ ని చూసి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వెంబడించి నిందితుడి ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు నిందితుడు
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ కాలనీలో నివాసం ఉండే మహమ్మద్ ఏజాజ్ ఉత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఇతను మద్యం సేవించడం వంటి చెడువాట్లకు అలవాటు పడి విలాసాల కోసం డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 8వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో నిందితుడు అదిలాబాదులోని విరాజ్ రెస్టారెంట్ కి వెళ్లి మోటార్ సైకిల్ నెంబర్ AP01AC 8181 బైకును దొంగలించాడు. రెస్టారెంట్ పార్కు ప్లేస్ నుంచి బైక్ను ఇంటికి తీసుకెళ్లి ఆ తరువాత బస్టాండ్ ఎదురుగా ఉన్న నలంద కాలేజ్ కాంప్లెక్స్ లో ఉన్న ఏటీఎం మెషిన్ ను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఏటీఎంలో ఉన్న సైరన్ శబ్దాలు వినిపించడంతో పోలీసులు అప్రమత్తమై అటు వైపు వెళ్లడంతో భయంతో అతను మోటార్ సైకిల్ తీసుకొని దాన్ని విక్రయించడానికి మహారాష్ట్ర లోని కిణ్వట్ కు పారిపోయాడు.
నిందితుడి పై కేసు వివరాలు : Cr. నం. 13/2023, U/Sec. PS ఆదిలాబాద్-I పట్టణం యొక్క 457, 380 R/W 511 IPC నమోదు అయింది.
దోనగలించిన బైక్ ను అమ్మే ప్రయత్నం చేయగా అతని వద్ద నుండి ఎవరు వాహనాన్ని కొనడానికి ముందుకు రాలేదు. సరైన పాత్రలు లేకపోవడం తో ఎవరు కొనలేదు.
నిందితుడు మళ్లీ బుదవారం రోజు రాత్రి మోటార్ సైకిల్ పై అదిలాబాద్కు వచ్చి తెల్లవారుజామున 4 గంటలకు అశోక్ రోడ్ లోని కన్యకాపరమేశ్వరి దేవాలయం ఎదురుగా ఉన్న ఏటీఎం బూత్ ముందు బైక్ ను పార్క్ చేసి దొంగతనానికి ప్రయత్నించాడు. ఇంతలో పెట్రోలింగ్ పోలీసు అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

పై నేరాలు జరిగినప్పటి నుండి పోలీసులు నేరస్థుడిని పట్టుకోవడం కోసం తీవ్రంగా గాలించారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసి, దొంగిలించిన మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. బైక్ విలువ రూ. 30,000 ఉంటుందని తెలిపారు. దొంగను పట్టుకోవడం లో కీలక పాత్ర పోషించిన సిబ్బంది కి డిఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ కె సత్యనారాయణ, ఎస్సైలు జి నారాయణ, ఏ హరిబాబు, అశోక్ ,అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments