అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం(APMS) జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు విజ్ఞప్తి……
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
సోయకు మద్దతు ధర రూ,, 9000 ప్రాకటించాలని అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం(APMS) తరుపున ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ,,3950 కాగా ఒక ఎకరాకు ఏజెన్సీ ప్రాంతం లో సరసారి మూడు క్వింటలు దిగుబడి వస్తుంది. అయితే ఒక ఎకరాకు పెట్టుబడి : దుక్కి దున్నడానికి 1200, కూలీల ఖర్చు 1000, ఒక సొయా బ్యాగ్ 4000, DAP 1200, యూరియా 350, స్ప్రే మందులు,800, కలుపు 500
సొయా తీయడానికి రూ,,3000, అల్లర్ పట్టడానికి రూ,,1500, ట్రాన్స్ స్పోర్ట్స్ రూ,,300 మొత్తం రూ,,13850 ఒక ఎకరాకు సరాసరిగా ఇంత ఖర్చు అవుతుంది. ఒక క్వింటలు ధర రూ,,3950 వుంది మూడు క్వింటలుకు మొత్తం :రూ,,11850 అవుతుంది. రైతు నష్టపోయేది ఒక ఎకరాకు రూ,,2000 నష్టపోతున్నారు ఒక రైతు సరాసరగా 10ఎకరాలు సేద్యం చేసిన రూ,,20000 నష్టపోతున్నారు.దీనికి తోడుగా నిత్యావసరం ధరలు పెరగడం, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం రైతులకు గుదిబండగా మారింది అందుకే దేశం లో గాని రాష్ట్రము లో గాని రైతులు ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయి.దేశానికి వెన్నుముఖ అయినటువంటి రైతు కన్నీరు పెట్టుకుంటే దేశానికి మంచిది కాదు. రైతుల ఉసురు తగిలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు మట్టికోట్టుకుపోవడం ఖాయం. కావున కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు రైతులను దృష్టిలో పెట్టుకొని మద్దతు ధర రూ,,9000 ప్రకటించాలని ప్రభుత్వలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ ఫూలే మహాజన సంఘం(APMS) జిల్లా ప్రధాన కార్యదర్శి దండుగుల మహేష్, సిర్పూర్ (ఉ) మండల నాయకులు సుద్దాల ఆనంద్, రైతులు, గోడం శేకు, కొట్నాక లింబరావు, గణపతి గోడం, జంగు తదితరులు పాల్గొన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments