
అదిలాబాద్ జిల్లా, మంగళవారం : తాగునీటి కార్యాచరణ ప్రణాళిక, భూగర్భ జలమట్టం మెరుగుదల చర్యల పై సంబంధిత జడ్పీ సీఈఓ, DRDO, DPO, DLPO, JDA, DD భూగర్బ జలశాఖ, గ్రిడ్ ee, de, ae, ఎంపిడిఓ లు, ఎంపీవో లు, EC అధికారులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా సమావేశం ఏర్పాటు చేసి క్రిటికల్ హ్యాబిటేషన్, లపై సమావేశం నిర్వహించి మండలాల వారీగా ఉన్న త్రాగునీటి సమస్యల పై ఆరా తీశారు.
Thank you for reading this post, don't forget to subscribe!

త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని , మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను పటిష్టం చేయాలని, లీకేజీలను వెంటనే సరిచేయాలి, బోర్లు, పంపుల మరమ్మతులు చేయాలని, నీటి వనరులను గుర్తించాలని పలు సూచనలు సలహాలు చేశారు.అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ముందస్తు చర్యలు:
మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా పటిష్టం:
మిషన్ భగీరథ నీటి సరఫరాను పటిష్టంగా చేయాలి, నీటి సరఫరాలో గల లోపాలను సరిచేయాలి.
లీకేజీలు, మరమ్మతులు:
నీటి పైపుల లీకేజీలను వెంటనే సరిచేయాలి, బోర్లు, పంపుల మరమ్మతులు చేయాలి.
నీటి వనరుల గుర్తింపు:
స్థానికంగా ఉన్న నీటి వనరులు, బోరు బావులను గుర్తించాలి.
అవగాహన కల్పన:
ప్రజలకు నీటిని సంరక్షించే అవసరం గురించి అవగాహన కల్పించాలి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు:
నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా:
అత్యవసర సమయాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి.
సమీక్షలు:
నీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించాలి.
సకాలంలో నివేదికలు:
గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి సమస్యను గుర్తించి వెంటనే నివేదిక అందించాలి.
నీటి సరఫరా ప్రణాళికలు:
ప్రతి గ్రామం, ప్రతి బస్తి, ప్రతి మున్సిపల్ వార్డులో త్రాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించుకోవాలి.
పటిష్టమైన చర్యలు:
నీటి లీకేజీ లను ఎప్పటికప్పుడు నియంత్రించేల పటిష్ట చర్యలు చేపట్టాలి.
బోర్లు, పంపుల మరమ్మతులు:
జిల్లా వ్యాప్తంగా ఉన్న త్రాగు నీటి పంపులు, బోరు బావుల మరమ్మత్తు పనులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆన్నారు.
అదిలాబాద్ రూరల్, ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ,
బజార్ హత్నూరు లలోని క్రిటికల్ హాబిటేశన్ లలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పంప్ హౌస్, బోర్ వెల్స్, బావులు, మిషన్ భగీరథ పైప్ లైన్ లికేజీలను వెంటవెంటనే గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
EGS మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA), ఇది గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఒక పథకం. నైపుణ్యం లేని పని చేయడానికి ముందుకు వచ్చే ప్రతి గ్రామీణ కుటుంబానికి, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పనిని హామీ ఇస్తుంది. ఈ సందర్భంగా వేసవిలో ఎండల తీవ్రత మరీ రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉదయం 6.00 గంటల నుండి 11.00 గంటల వరకు పనులు చేసేలా చర్యలు చేపట్టాలని drdo ను ఆదేశించారు.
ఉపాధి కూలీలకు పని ప్రదేశం లో రక్షణ కల్పించేందుకు ఉపాధి పథకంలో వాటర్ బెల్ విధానాన్ని అమలుచేయాలని, పనులకు హాజరయ్యే కూలీలకు గంటకోసారి నీళ్ళు త్రాగేలా పని ప్రదేశం లో ఏర్పాట్లు చేయాలని , నీడనిచ్చే షెడ్లు, ORS ప్యాకెట్స్, సరైన మందుల కిట్ అందుబాటులో ఉండాలని , వేసవి కాలం వెళ్ళెంతవరకు ఈ నాలుగు నెలలు పని ప్రదేశం లో వసతులు కల్పించాలని, తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Recent Comments