🔶 పట్టణంలో మరింత భద్రత కోసం అదనంగా పోలీసు పెట్రోలింగ్
🔶 పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు తోడ్పాటు ఇవ్వాలి
🔶 వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదు దారు పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. మొదటగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సిఐ కె శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీసు బృందం చే గౌరవ వందనం స్వీకరించి, అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్, లాకప్, మెన్ అండ్ విమెన్ విశ్రాంతి గదులను, రికార్డు రూమ్, రైటర్ రూమ్, కోర్టు డ్యూటీ అధికారి, పోలీస్ స్టేషన్లో పూర్తి అయిన కేసుల దస్త్రాలను పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ నందు ఉన్న పాత వాహనాలను పరిశీలించి వాటి స్థితిగతులపై విచారణ చేశారు. పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసుల దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు చేసి న్యాయస్థానంలో నిందితులను ప్రవేశపెట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న అన్ని వర్టికల్స్ ను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పోలీస్ స్టేషన్ ను జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమక్రమంగా నిర్వహించినప్పుడు మాత్రమే పోలీస్ స్టేషన్ పరిపాలన సమర్థవంతంగా నిర్వహించబడుతుందని తెలిపారు. పట్టణంలో దొంగతనాలు జరగకుండా ముందస్తుగానే పకడ్బందీగా గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. కాలనీల వారిగా ప్రజలకు చైతన్యపరచి సిసి కెమెరాలు అమర్చుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ డిఎస్పి వి ఉమేందర్, రెండవ పట్టణ సిఐ కే శ్రీధర్, సీసీ దుర్గం శ్రీనివాస్, ఎస్సైలు కె విష్ణు ప్రకాష్,కే విట్టల్, ఎం ఉషన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments