జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు – జిల్లా ఎస్పీ గౌష్ ఆలం…
*రంగుల హోలీ ఘనంగా జరుపుకున్న జిల్లా పోలీసులు.*
*సురక్షితమైన రంగులతో తగు జాగ్రత్తలు తీసుకొని హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచన.*
*పట్టణంలో విధులలో ఉన్న సిబ్బందికి స్వయంగా వెళ్లి హోలీ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.*

రిపబ్లిక్ హిందూస్థాన్ :
సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఐపిఎస్ జిల్లా పోలీసులతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పరేడ్ మైదానం నుండి సాయుధ పోలీసులు బ్యాండ్ మేళాలతో ఎస్పి క్యాంప్ కార్యాలయానికి చేరుకొని వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఎస్పీ తో కలిసి ఆనందోత్సవాల నృత్యాలు చేస్తూ, పోడి రంగులు చల్లుతూ సందడి చేశారు.





అనంతరం జిల్లా పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు, జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు అందించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని సూచించండి. తదుపరి పట్టణంలోని పలు ప్రాంతాల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి స్వయంగా వచ్చి వారికి వారి కుటుంబానికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంబరాల్లో అదనపు ఎస్పీ బి సురేందర్రావు, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కే సత్యనారాయణ, ప్ర కుమార్, ఎస్బిఐ రమాకాంత్, ఆర్ ఐ లు టి మురళి, చంద్రశేఖర్, సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments