◾️అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ◾️ నాలుగు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ◾️ఆదిలాబాద్ పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాలు, రూరల్ మండలంలోని ఒక పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
గురువారం ఉదయం స్థానిక పట్టణంలోని పదవ తరగతి పరీక్ష నిర్వహిస్తున్న కృష్ణవేణి, ఎస్ఆర్ డిజి, ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల అనే మూడు పరీక్ష కేంద్రాలను అదేవిధంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యాపలగూడ లో గల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని,అన్ని పరీక్ష కేంద్రాలను అనుసరిస్తూ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలోని ఏ ఒక్క సిబ్బంది వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండరాదని పరీక్షా కేంద్రం ఇన్చార్జితో తెలియజేశారు. పరీక్ష మొదలు కాకముందే సిబ్బంది సెల్ఫోన్లను బయట ఉంచే విధంగా చూడాలని సూచించారు. పరీక్ష కేంద్రం చుట్టూ ఎవరు కూడా ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల ఎటువంటి అత్యవసర అవసరంలోనైనా పోలీసు సిబ్బందిని సంప్రదించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ సీఐ కె సత్యనారాయణ, మావల ఎస్ఐలు విష్ణువర్ధన్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.



Recent Comments