*ప్రభుత్వ పాఠశాల వంట గదిలో పురుగుల మందు కలిపిన వ్యక్తి అరెస్టు – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*
*మధ్యాహ్న భోజన వంట సామాగ్రికి పురుగుల మందు పూసిన వ్యక్తి అరెస్టు.*
*ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘటన.*
*టీచర్ అప్రమత్తతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.*
*ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు,విచారణ కొనసాగింపు.*
ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామం నందు ప్రాథమిక పాఠశాల లో ఆది సోమవారాలు సెలవు ఉండడంతో పాఠశాల పూర్తిగా మూసి వేయబడి ఉంది. మంగళవారం ఉదయం పాఠశాల భవనంలోని వంటగది తాళం పగలగొట్టబడి ఉండడంతో అందులో ఒక పాత్ర నందు బకెట్ నందు తెలుపు వర్ణంతో నీరు ఉండడం అదేవిధంగా వంటగది సామాగ్రికి విజిల్స్ కి ఆ అనుమానిత కలుషిత నీరు ఉండటంతో అనుమానం వచ్చిన టీచర్ ప్రతిభ సర్పంచిని, స్థానిక పెద్దలను విచారించగా అది పురుగుల మందు అని తేలడంతో టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు విచారణ చేపట్టి అనుమానితుని అరెస్టు చేయడం జరిగింది. అనుమానితుడైన *సోయం కిస్టు* ధర్మపురి గ్రామం గోండు గూడ నివాసి ని విచారించగా తానే తన సోదరుడి ఇల్లు నిర్మల్ నుండి పురుగుల మందు తీసుకొని వచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి ఇట్టి చర్యను చేపట్టినట్టు ఒప్పుకున్నాడని తెలియజేశారు. సోయం కిస్టు కుటుంబ కలహాల కారణంగా మానసికంగా ఆందోళనతో నిరాశతో ఉన్న విషయాన్ని తెలుసుకోవడం జరిగింది.ఇంట్లో వారి పై కోపం తో, ఇంటి నుండి బయటకు పంపకుండా పనికి పంపకుండా ఉండడంవల్ల ఇలాంటి చర్యలకు చేపట్టినట్టు తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 103/25 తో sec 329(4),324(6), 331(8), 332 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఘటన నందు పాఠశాల విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగలేదని, ఘటనపై ఈరోజు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ మరియు ఇచ్చోడ సిఐ భీమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు.
Recent Comments