విధులలో నైపుణ్యం ప్రదర్శించిన వారికి నగదు రివార్డులతో ప్రోత్సాహం - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
◾️2022 సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలకు సంబంధించి వారి వారి విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 41 మంది అధికారులకు నగదు రివార్డులు అందజేత
◾️అక్టోబర్ నెలలో 18 మందికి, నవంబర్ నెలలో 16 మందికి, కోర్టు డ్యూటీ అధికారులు ఐదు మందికి, డిజిపి ద్వారా రాష్ట్రస్థాయిలో ఇద్దరికీ రివార్డుల ప్రధానం
◾️జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నగదు రివార్డులు, ప్రధానం చేసిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు అక్టోబర్ నవంబర్ మాసాలకు సంబంధించి వర్టికల్స్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి నగదు రివార్డులు, గుడ్ సర్వీస్ ఎంట్రీ లను అందించి ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వారికి కేటాయించిన విధులను సక్రమంగా నైపుణ్యంతో నిర్వహించినప్పుడు ఖచ్చితంగా రివార్డులను అందించి ప్రశంసించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే స్టేషన్కు వచ్చి బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరించి, బాధితుల ఫిర్యాదును స్వీకరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని, పోలీసు వ్యవస్థ పోలీస్ స్టేషన్ నుండి మొదలై న్యాయస్థానంలో ముగుస్తుందని తెలియజేశారు. న్యాయస్థానంలో విధులు నిర్వహించే కోర్టు డ్యూటీ అధికారి, పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ అధికారి బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్తులకు శిక్షలు పడేలా విచారణ చేపట్టినప్పుడు ప్రజలకు పోలీసు వ్యవస్థ పై నమ్మకం పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండు నెలలలో 16 వర్టికల్స్ నందు ప్రతిభ కనబరిచిన 11 పోలీస్ అధికారులు (ఎస్సైలు, సీఐలు) 30 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇందులో ఐదుగురు కోర్టు డ్యూటీ అధికారులకు నేరస్తులకు శిక్షలు పడే అంశంపై ప్రతిభ కనబరిచినందుకు రివార్డులను అందించారు. అక్టోబర్ నెలలో 18 మందికి, నవంబర్ నెలలో 16 మందికి అవార్డులు ప్రధానం చేశారు, అదేవిధంగా ఇద్దరు ఐటి కోర్ సిబ్బంది షేక్ మురద్ అలీ, ఎస్ కిషోర్ లకు గత నెల రాష్ట్ర మాజీ డిజిపి ఎం మహేందర్ రెడ్డి ప్రకటించిన జిల్లాలందు సిసిటిఎన్ఎస్, హెచ్ఆర్ఎంఎస్, టిఎస్ కాప్ రాష్ట్రస్థాయి అప్లికేషన్స్, వర్టికల్స్ లాంటి అంశాలను జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రకటించిన అవార్డును జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈరోజు ప్రధానం చేయడం జరిగింది. రివార్డులు అందుకున్న అధికారులలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ జె గుణవంతురావ్, ఎస్సైలు ఏ హరిబాబు, బి పెర్సిస్, డి రాధిక, కే రవీందర్, సయ్యద్ ముజాహిద్, బి సుమన్, ఎల్ ప్రవీణ్, ఈ సాయన్న, వి విష్ణువర్ధన్, ఎం ప్రవల్లిక ఉన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జై కృష్ణమూర్తి, ఎస్సై అన్వర్ ఉల్ హక్, సీసీ దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments