wp-1703860850345
https://rhdaily.net/wp-content/uploads/2023/12/wp-1703860850345.pdf
*జిల్లా పోలీసుల కఠోర శ్రమ వల్ల మహిళలపై నేరాల తగ్గుముఖం*
*మత్తు పదార్థాల నిర్మూలనకై మరింత నూతన కార్యచరణ ఏర్పాటు.*
*మూడు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో చేరుకునేలా డయల్ 100 సేవలు.*
*పాత్రికా సమావేశంలో వార్షిక నేర నివేదిక వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ*
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశం మందిరం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసింది పత్రికా సమావేశంలో జిల్లా వార్షిక నేర నివేదిక వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ప్రమాదాలను నివారించే లక్ష్యంగా పనిచేసిన జిల్లా పోలీసు యంత్రాంగం దానిని విజయవంతంగా పూర్తి చేసి గణనీయంగా ప్రమాదాలను తగ్గించగలిగామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో మహిళలపై జరుగు నేరాల సంఖ్య తగ్గుముఖం కావడంలో తోడ్పాటు అందించిన షీటీం బృందాలు చేసిన కృషి ఎంతగానో దోహాదపడిందని తెలిపారు. ఆపద్ కాల సమయంలో ప్రజలకు మేమున్నాం అంటూ నిమిషాల వ్యవధిలో చేరుకుని డయల్ 100 సేవలను మరింత మెరుగుపరచుకొని జిల్లా వ్యాప్తంగా మూడు నిమిషాల లోపు పోలీసులు సంఘటన స్థలాలకు చేరుకునేలా సిబ్బందికి నిరంతరంగా అవగాహనను కల్పిస్తూ మెరుగుపరచడం జరిగింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా మత్తుపదార్థాల నిర్మూలనకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీ చేస్తూ జిల్లాలో ఎటువంటి గంజాయి లాంటి మతపదార్థాలు లభించకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో పోలీసు ద్వారా ప్రజలకు చేసిన కార్యక్రమాలు
1) మెగా వైద్య శిబిరాలు – 3
మావోయిస్టు ప్రభావిత మారుమూల గిరిజన గ్రామాలలో మూడు మెగా మెడికల్ కాలం క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయడం జరిగింది.
2) బ్లాంకెట్ల పంపిణీ –
మారుమూల గిరిజన, కొలాం ప్రజలకు 800 బ్లాంకెట్లను ఉచితంగా అందజేయడం జరిగింది.
3) షీ టీం –
ఈ సంవత్సరం నందు 770 అవగాహన కార్యక్రమం ద్వారా వివిధ కళాశాలలో, పాఠశాలల నందు విద్యార్థులకు, ప్రజలకు మహిళల రక్షణకై పోలీసు వ్యవస్థ తీసుకుంటున్న చర్యలు, సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి అంశాలపై అవగాహనలు నిర్వహించడం.
4) ఆపరేషన్ ముస్కాన్/స్మైల్
జిల్లా వ్యాప్తంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సహకారంతో 204 పిల్లలను మంది బాల, బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.
5) సి ఈ ఐ ఆర్ – 163 నూతనంగా ఈ సంవత్సరం ఆవిర్భవించిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రజలు పోగొట్టుకున్న 163 మొబైల్ ఫోన్లను తిరిగి వారికి అందజేయడం జరిగింది.
6) సామాజిక మాధ్యమం అయిన ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సప్ ద్వారా ప్రజలు చేసిన 60 కంప్లైంట్ లను తీసుకుని పరిష్కరించడం జరిగింది.
7) ఈ సంవత్సరం ఏడుగురు సివిల్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించడం, ఒక జూనియర్ అసిస్టెంట్ కు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించడం జరిగింది.
కేసులు మరియు వివరాలు.
🔹 జిల్లాలో నమోదైన కేసులు
2022 – 3306
2023 – 4050
🔹 కోర్టుల నందు నేర నిరూపణ మేజర్.
2022 – 43 కేసులు
2023 – 33 కేసులు
🔹 న్యాయస్థానంలో పోలీసు కేసులు రుజువైనవి.
2022 – 726
2023 – 777
🔹 రోడ్డు ప్రమాదాల కేసులు
2022 – 286 (మరణాలు – 154, గాయపడిన వ్యక్తులు – 222).
2023 – 282 ( మరణాలు 127, గాయపడిన వ్యక్తులు 223)
🔹 తీవ్ర రోడ్డు ప్రమాదాలు
2022 – 4 (మరణాలు -15, గాయాలు 8)
2023 – 1 ( మరణాలు -4, గాయాలు -2)
🔹 హత్య కేసులు
2022 – 11
2023 – 18
🔹 లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడిన కేసులు.
2022 – 1118
2023 – 1284
🔹 మహిళలపై నేరాల కేసులు.
2022 – 329
2023 – 309
🔹 మైనర్ బాలికలపై జరిగిన నేరాల కేసులు.
2022 – 45
2023 – 49
🔹 గంజాయి కేసులు
2022 – 18 ( 49 వ్యక్తులు),
కేజీలు – 30
2023 – 29 (67 వ్యక్తులు)
కేజీలు – 291
🔹 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
2022 – 5494
2023 – 6714
🔹 ఆర్థిక నేరాలు
2022 – 188
2023 – 264
🔹 దొంగలించబడిన నగదు, ఆభరణాలు
2022 – Rs 1,22,35,135.
2023 – Rs 1,94,15,475.
నేరస్థుల నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు.
2022 – Rs 63,63,435.
2023 – Rs 64,05,136.
🔹 పేకాట కేసులు
2022 – 118 (వ్యక్తులు-680, నగదు 20,09,230)
2023 – 90 ( వ్యక్తులు – 511, నగదు 8,10,115/-)
🔹 మట్కా కేసులు
2022 – 91 ( వ్యక్తులు-210, నగదు 8,11,414/-)
2023 – 42 ( వ్యక్తులు -114, నగదు 6,50,160/)
Recent Comments