Tuesday, October 14, 2025

30 Police act : జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు – జిల్లా ఎస్పీ గౌష్ ఆలం



ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు, సభలు నిషేధం.

*సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.*

*మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
– జిల్లా ఎస్పి గౌస్ ఆలం

Thank you for reading this post, don't forget to subscribe!

ఆదిలాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులు సభ్యంగా కొనసాగించడానికి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో డిఎస్పి ఆపై స్థాయి అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమ్మిగుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులపై  చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

నిషేధిత ఆయుధాలు దురుద్దేశంతో నేరాలకు ఉసిగొలిపే ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సోషల్ మీడియా నందు అనవసరమైన విషయాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని తెలిపారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు. నిషేధం లో ఉన్న నిబంధనలు తప్పనిసరిగా అందరూ పాటించాలని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తు దరఖాస్తు చేసుకునే అనుమతులు తీసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!