— జిల్లా కేంద్రంలో ఇలా ఉంటే , గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు !?
— మిషన్ భగీరథ నీటి తో జలయమమైన రోడ్లు
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ తో నేతాజీ చౌక్ లో వరద వచ్చినట్లయింది. ఒక్కసారిగా నేతాజీ చౌక్ , అంబెడ్కర్ చౌక్ లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోవడం వల్లే ఇలా ఎప్పుడూ పడితే అప్పుడు లీకేజీ అవుతున్నాయి. ఒక వైపు చుక్క నీటి బొట్టు కాపాడుకోవడం కోసం ప్రపంచ దేశాలు , మన దేశం అహర్నిశలు శ్రమిస్తుంటే , అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల లక్ష ల లీటర్ల నీరు ఇలా వృధా అవుతున్నాయి.
ఏదేమైనా మిషన్ భగీరథ ప్రజల నీటి దాహం తీర్చడం ఏమో గాని వరద మాత్రం ఆదిలాబాద్ వాసులకు కష్టాల పాలు చేసింది.
*ఇదే విషయం పై ఆదిలాబాద్ ఆర్ డబ్యుఎస్ ఎస్.సి. వెంకటేశ్వర్లు ని వివరణ కోరగ ఇది తమ పరిధిలో రాదని , ఆదిలాబాద్ మున్సిపాలిటి పరిధిలో వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలియపరుస్తానని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments