“రైతుబంధు, కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ, క్రొత్త రేషన్ కార్డులకు అర్హుల అంచనాలు, పెన్షన్ల, మహాలక్షి, గృహాలక్ష్మి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ “
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21 (గురువారం)న హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్య మంత్రి, కలెక్టర్ల సమావేశం ఉన్నందున, మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, తహసీల్దార్ లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నివేదికలను సిద్ధం చేయాలనీ సూచించారు. రైతుబంధు, కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ, క్రొత్త రేషన్ కార్డులకు అర్హుల అంచనాలు, పెన్షన్ల, మహాలక్షి, గృహాలక్ష్మి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల వారీగా ధరణి, భూ సమస్యలు, ప్రభుత్వ, ప్రయివేటు భూ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై పూర్తీ సమాచారం అందించాలని సూచించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి వారం మండలాల వారీగా పెండింగ్ గ్రీవెన్స్ ల సమీక్ష చేయాలని, దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు… గుండె పోటుతో (18.12.2023) సోమవారం మరణించిన భీంపూర్ తహసీల్దార్ జె. నారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉద్యోగరీత్యా అధికారులు వివిధ ప్రాంతాలలో పనిచేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, శ్యామలాదేవి, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీఓ లు స్రవంతి, జివాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Recent Comments