విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పారు. పాఠాలు నేర్పించాల్సిన చోట విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అలాంటి ఉపాధ్యాయుల పై తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు..
Thank you for reading this post, don't forget to subscribe!
అదిలాబాద్ జిల్లాలో విద్యా సంస్థలలో జరిగిన అసభ్య ప్రవర్తన సంఘటనలపై తీసుకున్న చర్యలు
— జిల్లా కలెక్టర్ రాజర్షి షా
అదిలాబాద్ జిల్లాలో రెండు విద్యా సంస్థలలో చోటుచేసుకున్న బాలలపై అసభ్య ప్రవర్తనలకు సంబంధించి జిల్లా పాలన యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుందనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన సంఘటనల వివరాలు మరియు తీసుకున్న చర్యలు గురించి వెల్లడించారు.
1 . తాంసి మండలంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం అందిన నేపథ్యంలో, అతనిపై POCSO చట్టం కింద కేసు నమోదు చేసి FIR నమోదు చేయబడిందనీ తెలిపారు.
2. అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్‌లోని ఒక కోచ్ విద్యార్థిపై అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత విద్యార్థి తల్లి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం, ఆ కోచ్‌పై కూడా POCSO చట్టం ప్రకారం కేసు నమోదు చేయబడి FIR దాఖలైంది
3. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) స్పోర్ట్స్ స్కూల్ ఘటన పై విచారణ జరిపి టెర్మినేట్ చేయాల్సింది గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరియు తాంసి పాఠశాల ఉపాధ్యాడు పై శాఖ పర మైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
తీసుకున్న చర్యలు:
తాంసి స్కూల్ ఉపాధ్యాయుడిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.
స్పోర్ట్స్ స్కూల్ కోచ్‌ను ఉద్యోగం నుండి తొలగించారు (Termination).
ఉపాధ్యాయులు పాటించవలసిన ప్రవర్తనా నియమాలు (POCSO చట్టం ప్రకారం) ఈ క్రింది విధంగా ఉండాలని సూచించారు.
1. వృత్తిపరమైన హద్దులు:
అవసరం లేని శారీరక స్పర్శ చేయరాదు.
వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు (ఫోన్ నంబర్, సోషల్ మీడియా లింకులు).
2. పారదర్శక వ్యవహారం:
పిల్లలతో ఒంటరిగా మూసివేసిన గదిలో ఉండకూడదు.
పాఠశాల ఆమోదించిన కమ్యూనికేషన్ మార్గాలకే పరిమితంగా ఉండాలి.
3. గౌరవప్రదమైన భాష:
అసభ్య వ్యాఖ్యలు, లైంగిక జోకులు, హావభావాలు వాడరాదు.
దుస్తులు, శరీరం గురించి వ్యాఖ్యానించరాదు.
4. లింగసామ్య ప్రవర్తన:
విద్యార్థుల వ్యక్తిగత, సాంస్కృతిక పరిమితులకు గౌరవం ఇవ్వాలి.
5. సురక్షిత ఫిర్యాదు వాతావరణం:
విద్యార్థులు భయపడకుండా ఫిర్యాదు చేయగల వాతావరణం కల్పించాలి.
అన్ని ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి, అవసరమైతే POCSO కమిటీకి నివేదించాలి.
6. పాఠశాల వెలుపల జాగ్రత్తలు:
విద్యార్థుల ఫోటోలు/వీడియోలు వ్యక్తిగత మొబైల్‌లో భద్రపరచరాదు.
7. అవగాహన & శిక్షణ:
ఉపాధ్యాయులు తప్పనిసరిగా POCSO చట్టంపై శిక్షణ పొందాలి.
ఫిర్యాదు చేయకపోవడం కూడా చట్టరీత్యా శిక్షార్హం కావచ్చు నని కలెక్టర్ తెలిపారు.
Recent Comments